పంట బీమాను చేయించుకోండి | - | Sakshi
Sakshi News home page

పంట బీమాను చేయించుకోండి

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

నెల్లూరు(వేదాయపాళెం): రబీ సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఏర్పడే నష్టాలను నివారించేందుకు గానూ పంట బీమాను రైతులు నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పంట నష్టం సంభవించిన సమయంలో ఆర్థిక భరోసాను కల్పించేందుకు గానూ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పచ్చిశనగ, వేరుశనగ, పెసర, మినుము రైతులు తగిన ప్రీమియాన్ని డిసెంబర్‌ 15లోపు.. వరి రైతులు డిసెంబర్‌ 31లోపు నమోదు చేసుకోవాలని కోరారు. పచ్చిశనగ రైతులు ఎకరానికి రూ 56.. వేరుశనగకు సంబంధించి ఎకరానికి రూ.60.. పెసర ఎకరానికి రూ.36.. మినుము ఎకరానికి రూ.38 చొప్పున సాగు విస్తీర్ణాన్ని బట్టి ప్రీమియాన్ని చెల్లించాలని పేర్కొన్నారు. పంట నష్టం జరిగితే పచ్చి శనగకు రూ.28 వేలు, వేరుశనగకు రూ.30 వేలు, పెసరకు రూ.18 వేలు, మినుముకు రూ.19 వేల పరిహారాన్ని పొందొచ్చని తెలిపారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement