సోమశిల: అనంతసాగరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సోమశిల ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ సుందరరామిరెడ్డి ఆరోపించారు. పార్టీ స్థానిక కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. పోలీసులు, అధికారులు కుమ్మకై ్క కూటమి నేతల విజయాల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. తమ పార్టీ విజయం సాధించే ప్రతి రౌండ్‌లోనూ ఓట్లను చెల్లనివిగా పే ర్కొంటూ, ప్రశ్నించిన తమ ఏజెంట్లను బయటకు పంపారని దుయ్యబట్టారు. ప్రతి కౌంటర్ వద్దకు తహసీల్దార్ వీరవసంతరావు వెళ్లి కట్టకు 40 నుంచి 50 ఓట్ల ను తొలగించారని ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీని ప రిశీలిస్తే అక్రమాలన్నీ బయటపడతాయని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ జిల్లా సెక్రటరీ బట్రెడ్డి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అనంతసాగరం మండలంలో అన్ని పార్టీల నేతలు ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి రాజకీయాలు చేసుకునే వారని, అయితే ప్రస్తుతం దీన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని తాము భావిస్తున్నామన్నారు.
విజయాన్ని అడ్డుకున్నారు
తమ విజయాన్ని అన్యాయంగా అడ్డుకున్నారని పార్టీ అనంతసాగరం జెడ్పీటీసీ అభ్యర్థి అమరావతి భర్త రవీంద్రరెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తమను బయటకు నెట్టేసి, కౌంటింగ్‌లో తప్పులు చూపి టీడీపీ అభ్యర్థి శిరీష విజయం సాధించారని అన్యాయంగా ప్రకటించారని ఆరోపించారు. అనంతరం ప్రజాస్వామాన్ని పరిరక్షించాలని కోరుతూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. గౌరవరం, అనంతసాగరం – 2 ఎంపీటీసీలు సుమతి, విజయశాంతి, మంచాలపల్లి ఎంపీటీసీ అభ్యర్థి నీలకంఠం మస్తాన్, రైతు విభాగ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు అల్లంపాటి రామకృష్ణారెడ్డి, సోమశిల ఎంపీటీసీ అభ్యర్థి పెంచలయ్య, రవీంద్రరెడ్డి, శివారెడ్డి, పోలిరెడ్డి, పెంచలరెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.


