ప్రస్తుతం కార్తీకమాసంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తున్నట్లు ఉంది. కొన్నిరోజుల క్రితమే మెగాహీరో సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. హీరో తేజ సజ్జా త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నాడు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్.. కావ్య మారన్‌ని గ్రీస్‌లో వివాహమాడనున్నాడు. ఇవన్నీ అలా ఉండగానే 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. చెన్నైలో బుధవారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది.
(ఇదీ చదవండి: కొత్త హీరో కోసం ఏకంగా చరణ్, ఎన్టీఆర్, నాగార్జున.. ఎవరీ కుర్రాడు?)
న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన తమిళమ్మాయి ప్రియా భవానీ శంకర్.. మిడ్ రేంజ్ సినిమాల హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో కళ్యాణం కమనీయం, భీమా, జీబ్రా మూవీస్ చేసింది. కానీ ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన 'ఇరుముడి'తో అద్భుతమైన హిట్ కొట్టింది.
వ్యక్తిగత విషయానికొస్తే.. తన కాలేజీ రోజుల నుంచే అంటే గత పదేళ్లుగా క్లాస్‌మేట్ రాజ్ వేల్‌తో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని చాన్నాళ్ల క్రితమే రివీల్ చేశారు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ కార్యక్రమం జరిగిపోయింది.
(ఇదీ చదవండి: నా కంటే ముందు చాలామందితో డేటింగ్ చేశాడు: ప్రియా భవానీ శంకర్)
PBK Marriage❤💍 Priya Bhavani Shankar tied the knot with her longtime boyfriend Raj Velu🫂 #PriyaBhavaniShankar #Wedding https://t.co/TVXL2MmnoM
— Movie Buff (@moviesbuff_) November 11, 2026


