సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపెట్టరు. చాలా రహస్యంగా ఉంచుతారు. టాలీవుడ్‌లో అయితే రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు టాక్. అయినా సరే తమ బంధాన్ని రివీల్ చేయట్లేదు. కానీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాత్రం పదేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టింది. తాజాగా ఈమె తన ప్రియుడి గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిలేషన్‌షిప్ గురించి ఓ విలువైన సలహా కూడా ఇచ్చింది.
న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. తమిళంలో మిడ్ రేంజ్ సినిమా హీరోయిన్‌గా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. తాజాగా ఈమె లీడ్ రోల్ చేసిన 'హాట్ స్పాట్ 2' థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నిరోజుల క్రితం ఈమె, తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని వీళ్లిద్దరూ కలిసి చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. ప్రియ.. తన కాలేజీ మేట్ రాజ్ వేల్‌తో గత పదేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదే వీళ్లు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన వీళ్లిద్దరికీ లేనట్లే కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ)
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రియా భవానీ శంకర్ ఏం చెప్పిందంటే.. 'నాకు మొదటి, చివరి బాయ్‌ఫ్రెండ్ అతడు, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెబుతున్నా(నవ్వుతూ). నాతో రిలేషన్ మొదలుపెట్టకముందు కాలేజీ టైంలో అతడు చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. నేను చెప్పేదేంటంటే మీ విధేయత చూపించడానికి ఎక్కువ కాలం రిలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ టాక్సిక్ రిలేషన్‌షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి బంధం నుంచి బయటకొచ్చేయండి' అని చెప్పుకొచ్చింది.
తెలుగులో ఈమె.. కల్యాణం కమనీయం, భీమా, జీబ్రా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌లో ప్రియకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతానికైతే తమిళంపైనే ఫోకస్ చేసింది.
(ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)
I am sad to say that he's my first & last boyfriend. But he dated many girls before our relationship. I would say that, you don't have to be in long relationship only to show your loyalty. If you feel it's toxic, come out of it 👏🏽
— #PriyaBhavaniShankar pic.twitter.com/GFiEZovQxl— VCD (@VCDtweets) January 24, 2026


