ఈ ఏడాదిలో సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ సీన్. ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 6న బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్క్ చేరుకుంది.
ఈ మూవీ హిట్‌తో సూర్య ఖాతాలో హ్యాట్రిక్ పడింది. 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' తర్వాత ఈ చిత్రం మరో హిట్‌గా నిలిచింది. దీంతో వరుసగా మూడో విజయాన్ని అందుకున్నారు. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం ఈ మూవీ నాలుగో రోజున ఇండియాలో రూ. 21.25 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇండియాలో రూ. 84.40 కోట్ల నెట్ రాగా.. రూ. 98.05 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్‌సీస్‌లో రూ. 51.50 కోట్ల గ్రాస్ సాధించింది.
కాగా.. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా మెప్పించారు. ఈ మూవీలో నస్లెన్, ఆనందరాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య తమ సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.


