ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్‌ | PV Sindhu reaches final of Super 500 level tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్‌

Nov 1 2026 3:40 AM | Updated on Nov 1 2026 3:40 AM

PV Sindhu reaches final of Super 500 level tournament

సార్‌బ్రకెన్‌ (జర్మనీ): భారత అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ‘హైలో ఓపెన్‌’లో తన జోరును కొనసాగించింది. బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఈ సూపర్‌–500 టోర్నీలో సింధు ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత వారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధుకి ఇది వరుసగా రెండో ఫైనల్‌. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 21–13, 21–16 స్కోరుతో భారత్‌కు చెందిన అన్‌మోల్‌ ఖర్బ్‌పై విజయం సాధించింది. 

కెరీర్‌లో రెండో సారి మాత్రమే సూపర్‌–500 స్థాయి టోర్నీలో సెమీస్‌ చేరిన అన్‌మోల్‌ తన సీనియర్‌ సింధు ముందు 38 నిమిషాల పోరులో నిలవలేకపోయింది. తొలి గేమ్‌ ఆరంభంలో సింధు తడబడటంతో అన్‌మోల్‌ 4–2తో ముందంజ వేసినా, ఆ తర్వాత వరుస పాయింట్లతో సింధు 10–7కు దూసుకుపోయింది. 15–10తో పైచేయి సాధించిన అనంతరం అదే జోరులో గేమ్‌ను గెలుచుకుంది. 

రెండో గేమ్‌లో కూడా అన్‌మోల్‌ కాస్త పోటీనిచ్చింది. ఫైనల్లో సింధు ఎనిమిదో సీడ్‌ లైన్‌ హోమార్క్‌ (డెన్మార్క్‌)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు, ఏడో సీడ్‌ లక్ష్య సేన్‌ కూడా ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో అతను 21–17, 21–13 స్కోరుతో ఆరో సీడ్‌ తోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement