ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి | PV Sindhus French Open campaign ends with runner-up finish | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి

Oct 25 2026 5:33 PM | Updated on Oct 25 2026 5:35 PM

PV Sindhus French Open campaign ends with runner-up finish

ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకి నిరాశే ఎదురైంది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తుది పోరులో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి అన్ సే యంగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది.

తొలి గేమ్‌ను  21-16తో గెలుచుకుని సింధు శుభారంభం చేసినప్పటికీ, ఆ తర్వాత అన్ సే యంగ్ పుంజుకుని  రెండో గేమ్‌ను  21-11 తేడాతో సొంతం చేసుకుంది. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్‌లో కూడా 21-12 తేడాతో సింధుపై అన్ సే యంగ్ పైచేయి సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. కాగా అన్ సే యంగ్‌కు ఇది వరుసగా మూడో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.

మరోవైపు అన్ సే యంగ్‌పై సింధు ట్రాక్ రికార్డు అత్యంత దారుణంగా ఉంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన 11 ముఖాముఖి పోరులోనూ అన్ సే యంగ్‌యే విజయం సాధించడం గమనార్హం.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement