భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో జపాన్ యువ సంచలనం హినా అకేచిపై 21-10, 20-22, 21-16 తేడాతో అద్భుత విజయం సాధించిన సింధూ.. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ తుది పోరుకు అర్హత సాధించింది.