మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ-2026 షెడ్యూల్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) శనివారం ప్రకటించింది. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు ఖతార్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈసారి ఈ మెగా ఈవెంట్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ 'ఎ' జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగుతోంది. దోహాలో ఉన్న వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, 'యూనివర్సిటీ ఆఫ్ దోహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్రికెట్ గ్రౌండ్‌లు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో శ్రీలంక ఎ, బంగ్లాదేశ్ -ఎ, అఫ్గానిస్తాన్-ఎ, హాంగ్‌కాంగ్ జట్లు ఉండగా.. గ్రూపు-బిలో భారత్-ఎ, పాకిస్తాన్-ఎ, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి.
ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. నవంబర్ 19 నుండి నవంబర్ 24 వరకు ప్రతిరోజూ రెండేసి మ్యాచ్‌లు చొప్పున మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
రెండు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 26న, రెండో సెమీఫైనల్ నవంబర్ 27న జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 29న నిర్వహించబడుతుంది.
భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
భారత్ ఈ మెగా ఈవెంట్‌లో తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 20న నేపాల్‌తో తలపడనుంది. అనంతరం నవంబర్ 22న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: IND vs NZ: నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్, నితీశ్ రెడ్డి మెరుపులు.. భారత్ గెలుపు


