భారీ శతకం.. చరిత్ర సృష్టించిన నమీబియా కెప్టెన్‌ | Gerhard Erasmus Becomes First Namibian Player To Smash A Century Against Any Full Member Side In International Cricket | Sakshi
Sakshi News home page

భారీ శతకం.. చరిత్ర సృష్టించిన నమీబియా కెప్టెన్‌

Oct 24 2026 4:57 PM | Updated on Oct 24 2026 5:08 PM

Gerhard Erasmus Becomes First Namibian Player To Smash A Century Against Any Full Member Side In International Cricket

source: X

నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న వన్డేలో భారీ శతకం బాదిన అతడు.. ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్టుపై (టెస్ట్‌ హోదా కలిగిన జట్టు) సెంచరీ చేసిన తొలి నమీబియా ఆటగాడిగా (వన్డే లేదా టీ20) రికార్డు నెలకొల్పాడు.

ఐర్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో ఎరాస్మస్‌ చెలరేగిపోయాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 156 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

నమీబియా ఇన్నింగ్స్‌లో ఎరాస్మస్‌తో పాటు జాన్‌ ఫ్రైలింక్‌ (76) రాణించాడు. వీరిద్దరు మినహా జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. అలెగ్జాండర్‌ వోల్షంక్‌ 30, వాన్‌ లింగెన్‌ 22, లాఫ్టీ ఈటన్‌ 15, జేన్‌ గ్రీన్‌ 3, స్మిట్‌ 3 (నాటౌట్‌), స్టీన్‌క్యాంప్‌ డకౌటయ్యారు. 

ఐర్లాండ్‌ బౌలర్లలో గావిన్‌ హోయ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. జై మూంద్రా, మెక్‌డోనౌ, క్యాంపర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన ఐర్లాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌ కోసం ఐర్లాండ్‌ నమీబియాలో పర్యటిస్తోంది. 

ఇదీ చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్‌, నితీశ్‌ రెడ్డి మెరుపులు.. భారత్‌ గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement