గూగుల్‌కు జరిమానా! | Google has been fined 46. 3 million euros | Sakshi
Sakshi News home page

గూగుల్‌కు జరిమానా!

Sep 23 2026 5:21 AM | Updated on Sep 23 2026 5:21 AM

Google has been fined 46. 3 million euros

డబ్లిన్‌: అంతర్జాతీయ సర్చ్‌ దిగ్గజం గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌లో గట్టి దెబ్బ తగిలింది. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చట్టాలను అతిక్రమించినందుకు ఆ కంపెనీ 46.3 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాలని యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ సోమవారం ప్రకటించింది. వినియోగదారుల లోకేషన్‌కు సంబంధించిన సమాచారం, వెబ్, యాప్‌ ఆక్టివిటీ, లొకేషన్‌ హిస్టరీలు రెండింటి విషయంలో గూగుల్‌ చట్టాలకు తగ్గట్టుగా, పారదర్శకంగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో లొకేషన్‌ కచ్చితత్వానికి సంబంధించిన ఫీచర్‌ను కూడా గూగుల్‌ సరైన రీతిలో ఉపయోగించలేదని తమ విచారణ ద్వారా తెలిసిందని కమిషన్‌ వివరించింది. 

ఇరవై ఏడు దేశాల యూరోపియన్‌ యూనియన్‌లో గూగుల్‌ రెగ్యులేటర్‌గా ఐర్లాండ్‌ వ్యవహరిస్తోంది. డబ్లిన్‌ కేంద్రంగా పనిచేసే ఐర్లాండ్‌ డేటా కమిషన్‌ ఆరేళ్ల క్రితం గూగుల్‌పై విచారణను ప్రారంభించింది. వ్యక్తిగత గోప్యత విషయంలో ఈయూ జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ నిబంధనలు గూగుల్‌లో ఎలా అమలవుతున్నాయో పరిశీలించింది. 2018 – 2020 మధ్యకాలానికి సంబంధించి ఈ విచారణ జరిగింది.

అయితే ఈ కేసు పురాతన విధానాలకు సంబంధించిన అంశమని, 2019 నుంచి తాము కొన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టామని, లొకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని మేనేజ్‌ చేయడం సులువు చేశామని గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈయూ గతంలో టిక్‌టాక్‌పై ఒకసారి, మెటాపై రెండుసార్లు భారీ జరిమానాలు విధించగా గూగుల్‌పై 46.4 కోట్ల డాలర్ల జరిమానా విధించడం తాజా పరిణామం. గూగూల్‌ విషయంలో మరో మూడు వ్యక్తిగత గోప్యత అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement