ట్రంప్‌ టీవీ వచ్చేసింది! | White House launches Trump TV | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టీవీ వచ్చేసింది!

Sep 23 2026 5:15 AM | Updated on Sep 23 2026 5:15 AM

White House launches Trump TV

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ తాజాగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సర్వీసును ప్రారంభించింది. ‘ట్రంప్‌ టీవీ: ద ఎసన్షియల్‌ స్టేషన్‌’పేరుతో సోమవారం రాత్రి ఏడు గంటలకు ఈ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సేవలు ప్రారంభమయ్యాయి.

 సీఎన్‌ఎన్, ఎంఎస్‌ నౌ, పొలిటికో వంటి మీడియా సంస్థలకు వైట్‌హౌస్‌లో ప్రవేశాన్ని నిరాకరించిన రెండు రోజుల్లో ట్రంప్‌ ఈ కొత్త స్ట్రీమింగ్‌ సర్వీసును ప్రారంభించడం గమనార్హం. వారు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అందుకే నిషేధించామని ట్రంప్‌ తన చర్యను సమర్థి చుకున్నారు కూడా. వైట్‌హౌస్‌ బృందం ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సర్వీసుకు తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం కల్పిస్తోంది. వైట్‌హౌస్‌ వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానళ్లలో ఈ సర్వీసు లైవ్‌ ఫీడ్‌గా అందుబాటులో ఉంది. ‘‘ట్రంప్‌ ప్రభుత్వపు అతిపెద్ద క్షణాలు అన్నింటినీ ఒకే చోట చూడండి. టాప్‌ వీడియోస్, ప్రధాన వ్యాఖ్యలు, తప్పకుండా చూడాల్సిన హైలైట్స్‌ 24/7 ప్రసారమవుతుంటాయి. 

రియల్‌టైమ్‌లో అప్‌డేట్‌ అవుతుంటాయి. స్టే ఇన్‌ఫార్మ్‌డ్‌ అండ్‌ స్టే అప్‌ టు డేట్‌’’అంటూ ఈ సర్వీసు ప్రత్యేకతలను వర్ణించారు. ఫేక్‌ న్యూస్, కల్పిత వార్తలు, అబద్ధా్దలు ప్రచారం చేస్తున్నందుకు సీఎన్‌ఎన్, ఎంఎస్‌ నౌ, పొలిటికోను బహిష్కరిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడం.. ఈ విషయమై కోర్టులో కేసు వేయనున్నట్లు ఆ మూడు మీడియా సంస్థలు ప్రకటించడం ఇటీవలి పరిణామాలే. మరోవైపు అమెరికా టీవీ ఛానళ్లు ఏబీసీ, సీబీఎస్, సీఎన్‌ఎన్, ఫాక్స్, ఎన్‌బీసీలు అన్నీ ట్రంప్‌ టెలివిజన్‌ కవరేజ్‌ పూల్‌ నుంచి తప్పుకున్నట్లు సోమవారం ప్రకటించాయి. అధ్యక్షుడి కార్యక్రమాలు కొన్నింటిని చిత్రీకరించడం కోసం ఈ పూల్‌ ఏర్పాటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement