PC: BCCI Twitter
జపాన్‌తో జరుగుతున్న చారిత్రక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. మన బ్యాటర్లకు జపాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆతిథ్య జట్టు స్పిన్నర్లను ఆడేందుకు భారత బ్యాటర్లు తడబడ్డారు. అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్(9), ఇషాన్ కిషన్(3), తిలక్ వర్మ(1) వంటి ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (12 బంతుల్లో 16) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులే చేసింది. ఇక జపాన్ బౌలర్లలో చార్లీ హారా-హింజ్ రెండు, ఇబ్రహీం తకహషి, బెంజమిన్ తలా వికెట్ సాధించారు.
టీమిండియా చెత్త రికార్డు
కాగా ఈ పేలవ ప్రదర్శనతో టీమిండియా ఓ చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ముగ్గురు బ్యాటర్లు (అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్) కలిపి కేవలం 12 పరుగులకే మాత్రమే చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఒక అసోసియేట్ దేశంపై భారత టాప్-3 బ్యాటర్లు నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.
ఇంతకముందు 2026లో వాంఖడే వేదికగా యూఎస్‌ఎతో జరిగిన మ్యాచ్‌లో టాప్-3 బ్యాటర్లు నమోదు చేసిన 21 పరుగులే అత్యల్పంగా ఉండేది. ఇప్పుడు జపాన్ బౌలర్ల ధాటికి భారత్ ఆ చెత్త రికార్డును తిరగరాసింది.
చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


