Photo Credit: Twitter
జపాన్, టీమిండియా మధ్య చారిత్రక టీ20 మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. రేపు జపాన్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జపాన్ జట్టులో భారత్‌కు చెందిన బీహార్ క్రికెటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన ఫేవరెట్ అని పేర్కొన్న అభిషేక్ ఆనంద్.. తన బీహారీ సోదరులైన వైభవ్, ఇషాన్ కిషన్‌ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు.
అభిషేక్ మాట్లాడుతూ.."ప్రస్తుతం అందరి ఫేవరెట్ వైభవ్ సూర్యవంశీ. అయితే భారత జట్టులోని ఆటగాళ్లందరూ గొప్పవారే. కానీ, నా బీహారీ సోదరులైన ఇషాన్ కిషన్, వైభవ్‌లను కలిసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మేం కూడా రాణించాలంటే భారత్-జపాన్ మధ్య బంధం మరింత బలంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని వెల్లడించాడు.
జాబ్ కోసం జపాన్ వచ్చి..
అభిషేక్ ఆనంద్ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. క్రికెట్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం అతను ఉద్యోగ మార్గాన్ని ఎంచుకున్నాడు. బీహార్‌లో పుట్టి పెరిగిన అభిషేక్ ఐఐటీ కాన్పూర్‌లో చదివాడు. అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అతనికి ప్రముఖ కంపెనీ 'యాక్సెంచర్ జపాన్' నుంచి భారీ ప్యాకేజీతో ఉద్యోగావకాశం వెతుక్కుంటూ వచ్చింది. యాక్సెంచర్ ఇంటర్వ్యూ పూర్తయ్యాకా ఆఫర్‌ను స్వీకరించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి కంపెనీ యాజమాన్యం అతడికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చారు.
అయితే మరోవైపు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అభిషేక్ ఆనంద్..తనకు నచ్చిన జాబ్ వదులుకోవడం ఇష్టంలేదు. ఆ సమయంలో జపాన్‌లో క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతికాడు. అదృష్టవశాత్తూ, సరిగ్గా అదే ఏడాది జపాన్ జట్టు ఈస్ట్ ఆసియా-పసిఫిక్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించినట్లు వార్తలు కనిపించాయి. ఆ వార్తను చూశాక జపాన్‌లో కూడా క్రికెట్‌కు భవిష్యత్తు ఉంటుందని అభిషేక్ ఒక భావనకు వచ్చాడు. రెండు గంటల సుదీర్ఘ పరిశోధన తర్వాత యాక్సెంచర్ ఆఫర్‌ను అంగీకరించి జపాన్‌కు వచ్చాడు.
జపాన్‌కు వచ్చిన తర్వాత అభిషేక్ యాక్సెంచర్‌లో జాబ్ చేస్తూనే క్రికెటర్‌గా రాణించాడు. 'టోక్యో ఫాల్కన్ క్రికెట్ క్లబ్' తరఫున ఆడటం ప్రారంభించాడు. తొలి మూడేళ్లలో నిలకడగా రాణించడంతో అతనికి జపాన్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. 11 మ్యాచ్‌లాడి 564 పరుగులు సాధించాడు.
అలా ఉద్యోగం కోసం పరాయి దేశానికి వచ్చి, తన కలల క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అదే దేశంలో తన సొంత రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లను కలవాలని ఆశిస్తున్నాడు. ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలకు సంబంధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జపాన్, టీమిండియా ప్రత్యేక మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే చారిత్రక మ్యాచ్ ఆడేందుకు టీమిండియా జపాన్‌లో అడుగుపెట్టింది.
Abhishek Anand, 28.
Rohtas, Bihar → IIT Kanpur (Chemistry, captained the college team) → Tokyo job → Japan T20Is.
T20I debut: vs Cook Islands, May 9, 2025
18 T20Is | 275 runs | HS 55 | 1 wicket
How he got there
Campus placement (Accenture Japan). Interview line: he wanted to… pic.twitter.com/VtRxH3Vp5m— Cricket Hub (@Anurag9793) September 21, 2026
🚨 A Bihari will play for Japan against India at the Asian Games! 🇯🇵🇮🇳
Meet Abhishek Anand from Rohtas, Bihar. He moved from India to Japan for work, started playing local cricket and eventually earned a place in Japan’s national team.
He says, “I look like a Japanese player… pic.twitter.com/sM2HQCzDBi— Elysium (@CricketElysium) September 19, 2026
ఇదీ చదవండి: సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్


