Photo Credit: Twitter
చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకున్న స్టీఫెన్ ప్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే జహీర్ ఖాన్ సీఎస్‌కే కోచ్‌గా వస్తాడని ఎవరూ ఊహించలేదు.
ఇయాన్ మోర్గాన్ సహా ఇతర మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ, జహీర్ ఖాన్ పేరు మాత్రం వినిపించలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జహీర్ ఖాన్‌ను హెడ్‌కోచ్‌గా ఎంపిక చేస్తూ ఆ జట్టు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. సీఎస్‌కే ‘ఎక్స్’ వేదికగా.. ‘లెఫ్ట్ ఆర్మ్ టేకింగ్ ఓవర్.. సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.
జహీర్ ఖాన్‌కు హెడ్ కోచ్‌గా ఇదే తొలి బాధ్యత కావడం విశేషం. గతంలో ఆయన ముంబై ఇండియన్స్ జట్టుకు 2018 నుంచి 2022 వరకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2024 ఆగస్టు నుంచి 2025 సెప్టెంబర్ వరకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు.
2017లో అనిల్ కుంబ్లే భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో జహీర్‌ను తొలుత టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. అయితే అదే ఏడాది రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో జహీర్ పాత్రలో మార్పు చేశారు. బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆయన సేవలు అందించాడు.
Left Arm “Taking” Over! 💫🦁
Welcoming Zaheer Khan as the Head Coach of Chennai Super Kings!#WhistlePodu #Yellove 🦁💛— Chennai Super Kings (@ChennaiIPL) September 21, 2026
🚨 ZAHEER KHAN HAS BEEN APPOINTED AS THE NEW HEAD COACH OF CSK. 🚨 pic.twitter.com/zm2OBdM6OM
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2026
ఇదీ చదవండి: జెన్‌జీతో కలిసి డ్యాన్స్.. దుమ్మురేపిన జడేజా భార్య


