ఏషియన్ గేమ్స్ 2026 మెన్స్ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు ఆతిథ్య జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్-జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని మంగళవారం సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే జపాన్‌కు చేరుకోగా, ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో అంచనా వేద్దాం.
వైభవ్ సూర్యవంశీ రిటర్న్?
అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. అఫ్గాన్ సిరీస్‌లో మంచి ఫామ్‌లో రాణించిన సంజూ శాంసన్‌కు ఏషియన్ గేమ్స్‌కు ముందు విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ శాంసన్‌కు రెస్ట్ ఇస్తే వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.
బౌలింగ్ విభాగంలో మార్పులు
ఏషియన్ గేమ్స్ దృష్ట్యా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో యశ్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20కి దూరమైన ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నాడు. ఈ మార్పులు మినహా అఫ్గానిస్థాన్ సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
భారత తుది జట్టు( అంచనా)
వైభవ్ సూర్యవంశీ / సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యష్ ఠాకూర్.
చదవండి: IND: జపాన్, లంక, ఆసీస్‌తో.. రేపు రెండు టీ20లు, ఒక ‘టెస్టు’!


