Photo Credit: Twitter
శ్రీలంకను టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్ జట్టు వన్డే సిరీస్‌కు రెడీ అవుతుంది. మంగళవారం డుర్హమ్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంగ్లండ్ తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్‌లో ఆదిల్ రషీద్ (2 వికెట్లు) తీశాడు. అయితే తాను బౌలింగ్ చేసే చేతికి చిన్న గాయం కావడంతో తొలి వన్డేకు దూరమయ్యాడు.
గాయంతో బాధపడుతున్నందున అతడి స్థానంలో 22 ఏళ్ల ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్‌ను ఎంపిక చేసింది. ఆదిల్ రషీద్‌తో పాటు సొన్ని బేకర్, హెన్రీ క్రొకోంబె కూడా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. ఇక టీ20ల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ బాంటన్ వన్డేల్లో తొలిసారి ఓపెనింగ్ స్థానంలో రానున్నాడు. ఏడు వన్డేలాడిన టామ్ బాంటన్ 172 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ లంకతో రెండో టీ20లో 24 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది. ఆ తర్వాత శ్రీలంకను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు వన్డేల్లోనూ అదే తరహా జోరు ప్రదర్శించాలని బ్రూక్ సేన భావిస్తోంది. వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న ఇంగ్లండ్ (ఏడో స్థానం) సిరీస్ గెలిచి లంకను వెనక్కి నెట్టాలని చూస్తోంది.
ఇంగ్లండ్ జట్టు:
టామ్ బాంటన్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.
ఇదీ చదవండి: జపాన్ జట్టులో బీహార్ క్రికెటర్.. ‘వైభవ్ నా ఫేవరెట్ ప్లేయర్’


