PC: BCCI/X
జపాన్‌తో జరుగుతున్న చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. ఎదుర్కొన్న తొలి బంతిలోనే అవుటై తీవ్ర నిరాశపరిచాడు.
జపాన్ స్పిన్నర్ చార్లీ హారా-హింజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. అభిషేక్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్లు సంజూ శాంసన్(9), ఇషాన్ కిషన్(3) కూడా తీవ్ర నిరాశపరిచారు.
అభిషేక్ చెత్త రికార్డు
ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్‌గా జప్పీ బిమెన్యిమానా, అయూబ్, తుయిసెంగే సరసన అభిషేక్ నిలిచాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్లు వీరే
7 - జప్పీ బిమెన్యిమానా (రువాండా, 2023).
7 -ఆర్చిడ్ తుయిసెంగే (రువాండా, 2023).
7 - సైమ్ అయూబ్ (పాకిస్తాన్, 2025).
7 -అభిషేక్ శర్మ ( భారత్ 2026)
చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


