పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో ఇండియా-ఎ యువ ఆటగాడు, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ తీవ్ర నిరాశపరిచాడు. కెప్టెన్ దేవ్‌దత్త్ పడిక్కల్ ఔటయ్యాక సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
57 బంతులు ఎదుర్కొన్న రషీద్.. కేవలం 16 పరుగులు మాత్రమే చేసి రోచిచియోలి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అమన్ మోఖడే(6), పడిక్కల్(3) కూడా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్-ఎ జట్టు కేవలం 78 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో సాయిసుదర్శన్ 45 పరుగులతో ఉన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో విఫలమైనప్పటికి షేక్ రషీద్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రషీద్.. 44.15 సగటుతో 1987 పరుగులు చేశాడు. అతడి పేరిట ఐదు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తుది జట్లు
ఇండియా-ఎ: అమన్ మొఖడే, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్(కెప్టెన్), షేక్ రషీద్, యశ్ రాథోడ్, కుమార్ కుషాగ్రా(వికెట్‌కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ప్రఫుల్ హింగే
ఆస్ట్రేలియా-ఎ: సామ్ కొన్‌స్టాస్, క్యాంప్‌బెల్ కెల్లావే, నాథన్ మెక్‌స్వీనీ, పీటర్ హ్యాండ్‌స్కాంబ్(కెప్టెన్), జాసన్ సంఘా, జోష్ ఫిలిప్(వికెట్‌కీపర్), లియామ్ స్కాట్, ఫెర్గస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, కోరీ రోకిసియోలీ, బ్రెండన్ డాగెట్


