గాయమంటూ నాటకం? పాక్‌ స్టార్‌ బ్యాటర్‌పై రెండేళ్ల నిషేధం? | Imam-ul-Haq could face two-year ban after Lords Test injury controversy | Sakshi
Sakshi News home page

గాయమంటూ నాటకం? పాక్‌ స్టార్‌ బ్యాటర్‌పై రెండేళ్ల నిషేధం?

Sep 3 2026 7:55 AM | Updated on Sep 3 2026 8:24 AM

Imam-ul-Haq could face two-year ban after Lords Test injury controversy

పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయం వివాదం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో కాలి కండరాలు పట్టేశాయనే కారణంతో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే స్కానింగ్‌లో అది చిన్నపాటి గాయమేనని తేలినప్పటికి అతడు పూర్తిగా బ్యాటింగ్‌కు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. 

నాలుగో నాలుగో రోజు ఆట ముందు ఇమామ్ కాలికి పట్టీ కట్టుకుని షాడో బ్యాటింగ్, త్రోడౌన్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో ఇమామ్ కుంటుతూ నడవడంపై ఇంగ్లండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అతడు నటిస్తున్నాడని బ్రాడ్ బహిరంగంగా అనే విమర్శించాడు. అలాగే 2022లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇమామ్ గాయాలపై అనుమానాలు ఉన్నాయని పాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ మహమ్మద్ వసీం వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత పెంచింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. ఇమామ్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేస్తూ, వివరణ ఇచ్చేందుకు 48 గంటల గడువు విధించింది. జియో న్యూస్ కథనం ప్రకారం.. ఇమామ్ ఇచ్చే లిఖితపూర్వక సమాధానంతో పీసీబీ సంతృప్తి చెందకపోతే అతడిపై రెండేళ్ల నిషేధం విధించినున్నట్లు సమాచారం.

అంతేకాకుండా అతడి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసే అవకాశముంది. మరోవైపు ఆరోపణలు తీవ్రం కావడంతో ఇమామ్ న్యాయసలహా తీసుకుని పీసీబీకి అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా 30 ఏళ్ల ఇమామ్.. పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్-ఉల్-హక్ మేనల్లుడన్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘ఫిట్‌నెస్‌’పై స్పష్టత కావాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement