టెస్టు క్రికెట్‌పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు | Tilak Varma opens-Up-On-India-Dream-Love-To-Play-Test Cricket | Sakshi
Sakshi News home page

టెస్టు క్రికెట్‌పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Sep 2 2026 6:42 PM | Updated on Sep 2 2026 8:06 PM

Tilak Varma opens-Up-On-India-Dream-Love-To-Play-Test Cricket

Photo Credit: Twitter

దులీప్ ట్రోఫీలో భాగంగా వ‌న్ మ్యాన్ షో చేసిన కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ త‌న జ‌ట్టు సౌత్‌జోను ఒంటిచేత్తో ఫైన‌ల్ చేర్చాడు. నార్త్‌జోన్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచ‌రీ, రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థ‌సెంచ‌రీతో జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్ర‌జంటేష‌న్ సంద‌ర్భంగా తిల‌క్ వ‌ర్మ త‌న క్రికెట్ భ‌విత‌వ్యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

‘రెడ్ బాల్ క్రికెట్ ఆడ‌డాన్ని ఎంతో ఇష్ట‌ప‌డుతా. వైట్‌బాల్ క్రికెట్‌లో జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తానని నేనెప్పుడు క‌ల క‌న‌లేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నా. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ రెడ్‌బాల్ క్రికెట్‌లో బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా. 

అదే నా కల..
ఎప్పటికైనా టీమిండియా టెస్టు జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా. నిజానికి పదేళ్ల వయసు నుంచే క్రికెట్‌లో కష్టపడుతున్నా. నా కష్టాన్ని ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నా వయసు 23. ఐపీఎల్ కారణంగా వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్‌కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్‌లో చాలా కష్టంతో కూడిన గ్రౌండ్‌వర్క్ చేశాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. 

అదే నా బలం కూడా. ఇప్పుడైతే దేశం తరఫున టీ20లు, వన్డేల్లో ఆడుతున్నాను. గత మూడు, నాలుగేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు సమయం కుదరడం లేదు. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే రెడ్‌బాల్ క్రికెట్‌లో వీలైనంత మేర రాణించాలని భావించాను.’ అని చెప్పుకొచ్చాడు.

ఈజీగా మార్చుకోగలను..
అయితే టెస్టుల్లో ఇప్పుడు మూడు లేదా ఆరో స్థానం ఖాళీగా ఉంది. ఒకవేళ మీకు అవకాశమొస్తే ఆ స్థానాలను భర్తీ చేయగలరా అని తిలక్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనిపై తిలక్ వర్మ స్పందిస్తూ.. ‘నిజానికి రెడ్‌బాల్ నుంచి వైట్‌బాల్‌కు షిఫ్ట్ అవ్వడం ఈజీ. అదే సమయంలో వైట్‌బాల్ నుంచి రెడ్‌బాల్‌కు షిఫ్ట్ అవ్వడం కఠినం. కానీ నేను సాధ్యమైతనంత మేర వైట్‌బాల్ నుంచి రెడ్‌బాల్‌కు సులువుగానే మారగలను. అయితే రెడ్‌బాల్ క్రికెట్‌లో మంచి టెక్నిక్ ఉన్నప్పుడే మనం అన్ని ఫార్మాట్లలోనూ గుడ్ ప్లేయర్‌గా మారగలం’ అని పేర్కొన్నాడు. 

ఇక దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు ఫైనల్ చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. తనకు ఫైనల్ మ్యాచ్ ఆడాలని ఉందని, కానీ అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కారణంగా అది సాధ్యపడుతుందా అనేది చూడాలని తెలిపాడు. నిజానికి ఆఫ్గన్‌తో తొలి టీ20 మ్యాచ్ 13న జరగనుండడంతో, 11న టీమిండియాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నాడు. తనకు సాధ్యమైతే మాత్రం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ ఉన్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు.

 

చదవండి: లంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌; రెండేళ్ల త‌ర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement