తిల‌క్ వ‌ర్మ వ‌న్‌మ్యాన్ షో.. ఫైన‌ల్లో సౌత్‌జోన్‌ | Tilak Varma-Steals-Show-South Zone-Enters-Duleep-Trophy-Final | Sakshi
Sakshi News home page

తిల‌క్ వ‌ర్మ వ‌న్‌మ్యాన్ షో.. ఫైన‌ల్లో సౌత్‌జోన్‌

Sep 2 2026 3:15 PM | Updated on Sep 2 2026 3:33 PM

Tilak Varma-Steals-Show-South Zone-Enters-Duleep-Trophy-Final

Photo Credit: BCCI Twitter

దేశ‌వాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జ‌ట్టు ఫైన‌ల్లో అడుగుపెట్టింది. బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ గ్రౌండ్‌-2 వేదికగా నార్త్‌జోన్‌తో జ‌రిగిన రెండో సెమీఫైన‌ల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 182 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌత్‌జోన్ 43.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. 

కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ (79 బంతుల్లో 51 నాటౌట్‌) అజేయ‌ అర్థ సెంచ‌రీతో జ‌ట్టును విజ‌య‌ప‌థంలో నడిపించగా, స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్ (32 నాటౌట్‌) అత‌డికి స‌హ‌క‌రించాడు. అంత‌క‌ముందు ఓపెన‌ర్లు రికీ భుయ్ (42), నారాయ‌న్ జ‌గ‌దీష‌న్ (43) రాణించారు. నార్త్‌జోన్ బౌల‌ర్ల‌లో అబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీయ‌గా, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో అజేయ‌ సెంచ‌రీ, రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థ సెంచ‌రీతో రాణించి మ్యాచ్‌లో వ‌న్‌మ్యాన్ షో ప్ర‌ద‌ర్శ‌న కనబరిచిన కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్‌ 9 నుంచి) నుంచి మొద‌ల‌కానున్న దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈస్ట్‌జోన్‌తో సౌత్‌జోన్ అమీతుమీ తేల్చుకోనుంది. 

ఇక నార్త్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంత‌రం సౌత్‌జోన్ 312 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, తిల‌క్ వ‌ర్మ అజేయ సెంచ‌రీతో మెరిశాడు. దీంతో సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో  117 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. త‌మ రెండో ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్ 297 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో సౌత్‌జోన్ ముంగిట 180 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. 

Read: ‘సీఎం సార్‌ ప్లీజ్‌ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement