అతడు అందగాడు, మంచివాడు: ఇంగ్లండ్‌ దిగ్గజం | Very handsome Nice lad: Geoffrey Boycott Lauds Team India star | Sakshi
Sakshi News home page

అతడు అందగాడు, మంచివాడు: ఇంగ్లండ్‌ దిగ్గజం

Sep 2 2026 3:09 PM | Updated on Sep 2 2026 3:24 PM

Very handsome Nice lad: Geoffrey Boycott Lauds Team India star

రవీంద్ర జడేజా (PC: Ravindra Jadeja X)

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం జాఫ్రీ బాయ్‌కాట్‌ ప్రశంసలు కురిపించాడు. జడ్డూ అందగాడు.. అదే విధంగా మంచివాడు అంటూ కొనియాడాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో జడ్డూకు తప్పక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.

రవీంద్ర జడేజా ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి.. భారత్‌ 1-0తో సిరీస్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, జడ్డూ బౌలింగ్‌లో పస తగ్గిందనే విమర్శలు వచ్చాయి.

నా అభిమాన క్రికెట్‌ నువ్వే
ఈ నేపథ్యంలో జడ్డూ గురించి ప్రస్తావన రాగా.. జాఫ్రీ బాయ్‌కాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టిక్‌ టు క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘జడేజా కళాత్మకంగా బౌలింగ్‌ చేస్తాడు. అత్యద్భుతంగా ఫీల్డింగ్‌ చేస్తాడు. బ్యాటింగ్‌ కూడా చేయగలడు.

అతడు అందగాడు. అతడి గురించి ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పవచ్చు. ఇటీవలే తొలిసారిగా అతడిని ప్రత్యక్షంగా కలిశాను. గతేడాది ఇండియాకు వెళ్లినప్పుడు అతడితో మాట్లాడాను.

‘నా అభిమాన క్రికెట్‌ నువ్వే’ అని చెప్పాను. అందుకు అతడు.. ‘అసలు ఆ అవకాశమే లేదు’ అని నవ్వేశాడు. నేను మాత్రం నువ్వే నా ఫేవరెట్‌ అని మరోసారి చెప్పాను. అతడు ఎంతో అందగాడు. మంచివాడు. కేవలం క్రికెటర్‌ కాదు.. అత్యుత్తమ ఆల్‌రౌండ్‌ క్రికెటర్‌’’ అని బాయ్‌కాట్‌ జడ్డూను ఆకాశానికెత్తాడు.  

పోటీతత్వం ఎక్కువ
అదే విధంగా.. ‘‘అతడు ఎల్లప్పుడూ ఎనర్జీతో కనిపిస్తాడు. ఒత్తిడిలోనూ నవ్వులు చిందించగలడు. కఠిన సమయాల్లో జట్టును ఒడ్డుకు చేరుస్తాడు. అతడిలో పోటీతత్వం ఎక్కువ’’ అని జడ్డూను బాయ్‌కాట్‌ ప్రశంసించాడు. కాగా 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జడేజా ఇప్పటికి 91 టెస్టులు, 210 వన్డేలు, 74 టీ20లు ఆడాడు.

ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఖాతాలో టెస్టుల్లో 4160, వన్డేల్లో 2905, టీ20లలో 515 పరుగులు ఉన్నాయి. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ టెస్టుల్లో 356, వన్డేల్లో 232, టీ20లలో 54 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

చదవండి: ‘రిటైర్మెంట్‌ వరకు అతడే టీమిండియా కెప్టెన్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement