‘సీఎం సార్‌ ప్లీజ్‌ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి | Ronaldo Sister Elma-Meets-Kerala-CM-VD Satheeshan-Carees Special Msg | Sakshi
Sakshi News home page

‘సీఎం సార్‌ ప్లీజ్‌ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి

Sep 2 2026 2:51 PM | Updated on Sep 2 2026 3:19 PM

Ronaldo Sister Elma-Meets-Kerala-CM-VD Satheeshan-Carees Special Msg

Photo Credit: Twitter

పోర్చుగ‌ల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోద‌రి ఎల్మా అవీరో భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. 'CR7' బ్రాండ్ డైరెక్టర్ అయిన ఎల్మా అవీరో కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (V.D. Satheesan)తో భేటీ అయ్యారు. కోజికోడ్‌లో బాబీ చెమ్మ‌నూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ జ్యువెల్ల‌ర్స్ షోరూమ్ "స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్‌" కార్య‌క్ర‌మానికి హాజరైన ఆమె, తాను బస చేసిన హోటల్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఇద్ద‌రు క‌లిసి ఫొటోల‌కు ఫోజులివ్వడాన్ని ఎల్మా స్వ‌యంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే.. కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌తీషన్ రొనాల్డోకు పెద్ద అభిమాని అని తెలిసింది. వ్య‌క్తిగ‌త ప‌నిమీద భార‌త్‌కు వ‌చ్చిన ఎల్మా అవీరో కేర‌ళ‌లో రొనాల్డోను విప‌రీతంగా అభిమానిస్తార‌న్న విష‌యం తెలుసుకున్నారు. 

కోజికోడ్ ప్రైవేట్ కార్య‌క్ర‌మం ముగించుకున్న ఆమె కేర‌ళ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరారు. స్వ‌త‌హాగా రొనాల్డోకు వీరాభిమాని కావ‌డంతో ముఖ్య‌మంత్రి వీడీ స‌తీష‌న్ ఎల్మాకు స్వాగ‌తం ప‌లికారు. రొనాల్డోకు కేర‌ళ‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని, తాను కూడా రొనాల్డోకు వీరాభిమానిన‌ని స‌తీషన్ వెల్ల‌డించారు. 

కేర‌ళ‌లో ఫుట్‌బాల్‌కు ఇంత ఆద‌ర‌ణ ఉంద‌న్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న సోద‌రుడు రొనాల్డోకు ఫ్యాన్ బేస్ ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని, ఈ విష‌యాన్ని రొనాల్డోతో పంచుకుంటాన‌ని ఎల్మా అవేరో చెప్పుకొచ్చింది. అనంత‌రం స‌తీష‌న్‌ను.. ‘సీఎం సార్‌.. ప్లీజ్‌ ఒక్క ఫొటో’ అని ఎల్మా అడిగింది. దీనికి అంగీక‌రించిన కేర‌ళ సీఎం ఆమెతో ఫొటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక క్రిస్టియానో రొనాల్డో ప్ర‌స్తుతం సౌదీ అరేబియా క్ల‌బ్ అల్ న‌స్ర్‌కు ఆడుతూ బిజీగా గ‌డుపుతున్నాడు. ప్ర‌స్తుతం 978 గోల్స్‌తో ఉన్న రొనాల్డో 1000 గోల్స్ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక పోర్చుగ‌ల్ త‌ర‌ఫున ఈ ఏడాది ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడిన రొనాల్డో జ‌ట్టును ఫైన‌ల్ చేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. 

రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన రొనాల్డో ప్ర‌స్తుత వ‌య‌సు 41 కావ‌డంతో అత‌డు త‌న చివ‌రి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడేసిన‌ట్లే. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 11 గోల్స్ కొట్టిన రొనాల్డో వ‌రుస‌గా ఆరు ప్ర‌పంచ‌క‌ప్పుల్లో గోల్స్ కొట్టిన తొలి ప్లేయ‌ర్‌గా నిలిచాడు.

 

Read: విరాట్‌ కోహ్లి రికార్డ్‌ను సమం చేసిన సౌతాఫ్రికా స్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement