35 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు; ట్రోల్‌ చేసినోళ్లకు హెచ్చరిక | Mohammed Shami Stuns With One Handed Catch As India Return Hopes Rise After Duleep Trophy Show, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

35 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు; ట్రోల్‌ చేసినోళ్లకు హెచ్చరిక

Sep 1 2026 3:11 PM | Updated on Sep 1 2026 3:40 PM

Mohammed-Shami Stunning Caught-Bowled-Mocks-Age-Troll-Duleep-Trophy

Photo Credit: BCCI Twitter

దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టీమిండియా సీనియ‌ర్ బౌల‌ర్ మహ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ స‌త్తా చాటుతున్నాడు. సెంట్ర‌ల్ జోన్‌తో జ‌రుగుతున్న సెమీఫైన‌ల్లో ష‌మీ రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ష‌మీ తీసిన మూడు వికెట్లు తీయ‌గా.. అందులో క్రీజులో పాతుకుపోయిన హ‌ర్ష్ దూబేని అద్భుత రీతిలో కాట్ అండ్ బౌల్డ్‌గా పెవిలియ‌న్ చేర్చ‌డం విశేషం. 

బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ గ్రౌండ్ 1లో సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుంది. సెంట్ర‌ల్ జోన్ ఇన్నింగ్స్ 46వ ఓవ‌ర్ ష‌మీ యార్క‌ర్ బాల్ వేశాడు. హ‌ర్ష్ దూబే డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేయ‌గా, బంతి ఎడ్జ్ అయి ష‌మీ వైపు దూసుకొచ్చింది. అప్ర‌మ‌త్త‌మైన ష‌మీ ఎలాంటి పొర‌పాటు చేయ‌కుండా ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవ‌డంతో హ‌ర్ష్ దూబే షాక్ తిన్నాడు. 


Photo Credit: BCCI Twitter

అప్ప‌టికే హ‌ర్ష్ దూబే 51 బంతుల్లో 24 ప‌రుగుల‌తో క్రీజులో నిల‌దొక్కుకున్నాడు. హ‌ర్ష్‌దూబే వెనుదిరిగిన వెంట‌నే సెంట్ర‌ల్ జోన్ ఆలౌటైంది. ష‌మీ 56 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో సెంట్ర‌ల్ జోన్ 50.2 ఓవ‌ర్ల‌లో 158 ప‌రుగుల‌కు ఇన్నింగ్స్‌ను ముగించింది. 35 ఏళ్ల వ‌య‌సులోనూ సూప‌ర్ ఫిట్‌నెస్‌తో అద‌ర‌గొడుతున్న ష‌మీని జాతీయ జట్టులోకి తీసుకోవాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దులీప్ ట్రోఫీలో ష‌మీ నుంచి ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న రావ‌డం అభినందించాల్సిన విష‌యం.

గ‌తేడాది విజ‌య్ హ‌జారే ట్రోఫీలోనూ ష‌మీ అంచ‌నాల‌కు మించి రాణించాడు. ఏడు ఇన్నింగ్స్‌లు క‌లిపి 15 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌లో ష‌మీ బెంగాల్ త‌ర‌ఫున‌ ఏడు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు ప‌డ‌గొట్టాడు. రంజీ ట్రోఫీలోనూ ష‌మీ ఏడు మ్యాచ్‌ల్లోనే 37 వికెట్లు ప‌డ‌గొట్టి సెలెక్ట‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు పంపాడు.

ష‌మీ భార‌త్ త‌ర‌ఫున చివ‌రిసారి 2025 ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడాడు. అప్ప‌టినుంచి ష‌మీ మ‌ళ్లీ జాతీయ జ‌ట్టుకు ఆడ‌లేదు. 2023లో భార‌త్‌లో జ‌రిగిన‌ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ష‌మీ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 24 వికెట్లు ప‌డ‌గొట్టడం విశేషం. ఇంత మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికీ, గాయాలు అత‌డిని త‌ర‌చూ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అదే గాయాల సాకుతో టీమిండియా మేనేజ్‌మెంట్ ష‌మీని పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేయ‌డం గ‌మ‌నార్హం.

Read: కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌పై వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement