మరోసారి దంచికొట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. కానీ! | Vaibhav Suryavanshi 4, 6, 4, 4 Finally Loss Batlle To Yash Thakur Video | Sakshi
Sakshi News home page

ధనాధన్‌ దంచికొట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. కానీ!.. వీడియో వైరల్‌

Sep 1 2026 3:26 PM | Updated on Sep 1 2026 4:01 PM

Vaibhav Suryavanshi 4, 6, 4, 4 Finally Loss Batlle To Yash Thakur Video

వైభవ్‌- పాటిదార్‌ (PC: BCCI Domestic)

దులిప్‌ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్‌ ఠాకూర్‌ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్‌ పెవిలియన్‌ చేరాడు.

దులిప్‌ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్‌ జోన్‌- సెంట్రల్‌ జోన్‌ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. సౌత్‌ జోన్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ధనాధన్‌
ఆ తర్వాత ఈస్ట్‌ జోన్‌ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్‌ హాఫ్‌ సెంచరీ (69) సాధించగా.. వైభవ్‌ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్‌ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్‌ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్‌ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విఫలం కాగా.. అర్షద్‌ ఖాన్‌ క్యాచ్‌ పట్టడంతో వైభవ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

నెమ్మదిగా మొదలుపెట్టినా..
ఇదిలా ఉంటే.. సౌత్‌ జోన్‌ తమ రెండో ఇ‍న్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్‌ జోన్‌ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు.

 

ఆఖరి బంతికి అవుట్‌
సౌత్‌ జోన్‌ పేస్‌ బౌలర్‌ యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్‌ బాదిన వైభవ్‌.. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్‌.. ఆఖరి బంతికి మరోసారి షాట్‌కు యత్నించి వికెట్‌ సమర్పించుకున్నాడు.

యశ్‌ ఠాకూర్‌ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్‌ జోన్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకోవడంతో వైభవ్‌ ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. 

చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement