breaking news
Yash Thakur
-
ఐపీఎల్‌కే దిక్కులేదు.. వారికి టీమిండియాలో చోటా?
ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో యువ పేసర్ యష్ ఠాకూర్‌ను ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుపట్టాడు. అతడు ఇండియన్ క్యాప్ ధరించేందుకు అర్హుడు కాదని శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అఫ్గాన్‌తో టీ20లకు తొలుత ఎంపిక చేసిన జట్టులో యశ్ఠాకూర్కు చోటు దక్కలేదు. కానీ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరం కావడంతో ఆఖరి నిమిషంలో సెలక్టర్ల నుంచి అతడు పిలుపు అందుకున్నాడు. అయినప్పటికి తొలి రెండు టీ20లకు అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు కానీ. ఆఖరి టీ20లో మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో అతడికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. రెండు ఓవర్లలో అతడు 17 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వరల్డ్‌కప్ విన్నర్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు."యష్ ఠాకూర్ లాంటి సాధారణ ఆటగాడికి భారత జట్టులో ఎలా చోటు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇలా ఎవరికి పడితే వారికి టీమిండియా క్యాప్ ఇస్తే.. జాతీయ జట్టులోకి రావడం చాలా సులభమనే తప్పుడు సంకేతాలు బయటకు వెళ్తాయి. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు.భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే అద్భుతమైన ప్రతిభతో పాటు దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసిండాలి. భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్లను పక్కన పెట్టి యష్ ఠాకూర్‌ను ఆడించడం అన్యాయం.యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వంటి వారు కనీసం తమ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే రెగ్యులర్ సభ్యులుగా లేరు. అలాంటిది వారిని నేరుగా తీసుకొచ్చి భారత జట్టు తరఫున ఆడిస్తున్నారు.మరోవైపు సడన్‌గా విప్రజ్ నిగమ్ జట్టులోకి ఎలా వచ్చాడు? ఏ ప్రాతిపదికన అతడిని ఎంపిక చేశారు? వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసేంత గొప్ప బౌలరా అతడు? ఇలా ప్రతీ ఒక్కరికీ భారత జట్టు క్యాప్‌ను పంచేయలేరు. ఇదంతా చూస్తుంటే ఏదో షాప్‌లో టీమిండియా క్యాప్‌ను కొనుగోలు చేసినట్లుగా ఉంది" అని శ్రీకాంత్ తీవ్ర స్దాయిలో మండిపడ్డాడు.చదవండి: నా కెరీర్లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్ -
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్‌కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’ -
మరోసారి దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్ ఠాకూర్ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్ పెవిలియన్ చేరాడు.దులిప్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్ జోన్- సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ధనాధన్ఆ తర్వాత ఈస్ట్ జోన్ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ (69) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విఫలం కాగా.. అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.నెమ్మదిగా మొదలుపెట్టినా..ఇదిలా ఉంటే.. సౌత్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్ జోన్ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 4⃣,6⃣,4⃣,4⃣, 🇼Vaibhav Sooryavanshi 🆚 Yash Thakur battle part 2⃣ 🔥#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/wX8L5AHdTB— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఆఖరి బంతికి అవుట్సౌత్ జోన్ పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన వైభవ్.. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్.. ఆఖరి బంతికి మరోసారి షాట్‌కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.What. A. Catch 😮Central Zone captain Rajat Patidar pulls off an absolute blinder 🔥Scorecard ▶️ https://t.co/kyExeix2VY#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/NfAD3Kk9RH— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026యశ్ ఠాకూర్ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. హరారా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో పేసర్ యశ్ ఠాకూర్ భారత్ తరపున డెబ్యూ చేశాడు. తొలి టీ20 ఆడిన అశోక్ శర్మను పక్కన పెట్టి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఎవరీ యశ్ ఠాకూర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ యశ్ ఠాకూర్?27 ఏళ్ల యశ్ ఠాకూర్ 1998లో కోల్‌కతాలో జన్మించాడు. కానీ ఈ రైట్ ఆర్మ్ పేసర్ దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు ఇప్పటికే రంజీలతో పాటు లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ 'ఎ' జట్టు తరపున కూడా అతడు తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుమందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.ఈ ఏడాది సీజన్‌కు ముందు అతడిని రూ. 1.60 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను తన ఆదర్శంగా తీసుకున్న యశ్ ఠాకూర్.. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దిట్ట. ఈ క్రమంలోనే అతడికి భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడే అవకాశం దక్కింది. ఈ విదర్భ పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Ind vs Zim 2nd T20 live updates: హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.జింబాబ్వే ఏడో వికెట్ డౌన్‌జింబాబ్వే ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన బ్రాడ్ ఎవాన్స్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ బర్ల్.. తిలక్ వర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 90/6జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మాధవీరే.. దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ సికందర్ రజా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆతిథ్య జట్టు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.జింబాబ్వే మూడో వికెట్ డౌన్‌జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన డియోన్ మైర్స్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.జింబాబ్వే రెండో వికెట్ డౌన్‌జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బెన్ కుర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే తొలి వికెట్ డౌన్‌జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 32 పరుగులు చేసిన బ్రియాన్ బెన్నెట్.. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న జింబాబ్వే220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో బెన్నెట్(22), బెన్ కుర్రాన్(1) తలా వికెట్ సాధించారు.జింబాబ్వే టార్గెట్ 220 పరుగులుహరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 81 పరుగులు చేసిన కిషన్.. న్యూమన్ న్యాముహురి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 195/5తిలక్ వర్మ ఫిప్టీతిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు. ఈ హైదరాబాదీ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 188/3భారీ స్కోర్ దిశగా భారత్16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(75), తిలక్ వర్మ(40) ఉన్నారు.ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీఇషాన్ కిషన్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో కిషన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 51 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా మూడో వికెట్ డౌన్టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బెన్నెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 95/3నిలకడగా ఆడుతున్న శ్రేయస్, కిషన్8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఇషాన్ కిషన్(26) ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్.. వైభవ్ ఔట్వైభవ్ సూర్యవంశీ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేసిన వైభవ్.. నగరావ బౌలింగ్‌లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.5వ ఓవర్- 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (8) ఔటయ్యాడు. హరారే వేదికగా రెండో టీ20లో జింబాబ్వే-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌తో టీమిండియా తరపున యువ పేసర్ యాశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. అశోక్ శర్మ స్ధానంలో యశ్ ఠాకూర్‌కు అవకాశమిచ్చారు. జింబాబ్వే మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..!
ఇరానీ కప్ 2025 (Irani Cup 2025) చివరి రోజు (అక్టోబర్ 5) హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ దశలో ఇరువురు కొట్టుకున్నంత పని చేశారు. ఈ ఘర్షణ గతంలో (2013) గంభీర్-కోహ్లి (Gambhir-Kohli) మధ్య జరిగిన ఫైట్‌ను గుర్తు చేసింది. తాజా ఘటన సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.పూర్తి వివరాల్లో వెళితే.. రంజీ ఛాంపియన్ విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు ఇరానీ కప్ 2025 కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచి గ్రాండ్ డబుల్ (రంజీ, ఇరానీ ట్రోఫీలు) సాధించింది.అయితే ఆట చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్ యశ్ ధుల్ (Yash Dhull), విదర్భ బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) గొడవపడ్డారు. రెస్ట్ ఆఫ్ ఇండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.మ్యాచ్ 63వ ఓవర్లో యశ్ ఠాకూర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని యశ్ ధుల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, అథర్వ తైడే అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. ఆ సమయానికి ధుల్ 92 పరుగుల వద్ద ఆడుతూ మ్యాచ్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. సెంచరీ ముందు ఔట్ కావడమే కాకుండా తన జట్టును గట్టెక్కించలేకపోయానన్న బాధలో ధుల్ ఉండగా.. యశ్ ఠాకూర్ అత్యుత్సాహంతో సంబురాలు చేసుకున్నాడు.ఈ క్రమంలో యశ్ ఠాకూర్ ధుల్‌ను ఉద్దేశిస్తూ ఏదో అన్నాడు. అప్పటికే ఔటైన అసహనంలో ఉన్న ధుల్ యశ్ ఠాకూర్పైకి తిరగబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. ధుల్, ఠాకూర్ ఒకరిపైకి ఒకరు దూసుకుపోయారు. అంపైర్లు అడ్డుపడకుంటే ఖచ్చితంగా కొట్టుకునే వారు. అంతిమంగా అంపైర్లు, సహచరులు వారించడంతో ఇరువురు తగ్గారు. దీంతో గొడవ సద్దుమణిగింది.pic.twitter.com/LwuqQrd4IA— Nihari Korma (@NihariVsKorma) October 5, 2025ధుల్ ఔటయ్యాక లయ తప్పిన రెస్ట్ ఆఫ్ ఇండియా 30 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ధుల్‌కు చేదోడుగా ఉండిన మానవ్ సుతార్ అర్ద సెంచరీ పూర్తి చేసి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసి విదర్భ గెలుపుకు ప్రధాన కారకుడైన అథర్వ తైడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
224 పరుగుల ఆధిక్యంలో...
నాగ్‌పూర్ వేదికగా ఇరానీ కప్ (Irani Cup 2025) మ్యాచ్‌పై విదర్భ జట్టు పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India)తో జరుగుతున్న ఈ పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. సెంచరీ హీరో ఈసారి ఫెయిల్దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఇరానీ కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అథర్వ తైడె (15), అమన్ (37) అవుట్ కాగా... ధ్రువ్ షోరె (Dhruv Shorey- 60 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్), దానిశ్ మాలేవర్ (37 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. లక్ష్యం ఎంతో?రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా మూడో రోజు కూడా ఆటకు ఆటంకం వాటిల్లింది. మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... 8 వికెట్లు చేతిలో ఉన్న విదర్భ జట్టు... ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. అంతకుముందు విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 69.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రజత్ పాటీదార్ (125 బంతుల్లో 66; 10 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (112 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1), మానవ్ సుతార్ (1) విఫలమవడంతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు చేయలేకపోయింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... హర్ష్ దూబే, పార్థ్ చెరో 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 342; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: అభిమన్యు (ఎల్బీ) (బి) పార్థ్ 52; ఆర్యాన్ జుయెల్ (ఎల్బీ) (బి) దర్శన్ 23; యశ్ ధుల్ (స్టంప్డ్) వాడ్కర్ (బి) హర్శ్ దూబే 11; రజత్ పాటీదార్ (సి) రాథోడ్ (బి) హర్శ్ దూబే 66; రుతురాజ్ గైక్వాడ్ (సి) రాథోడ్ (బి) యశ్ ఠాకూర్ 9; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) పార్థ్ 1; మానవ్ సుతార్ (ఎల్బీ) (బి) యశ్ ఠాకూక్ 10; ఆకాశ్‌దీప్ (సి) అథర్వ (బి) యశ్ ఠాకూర్ 14; అన్షుల్ కంబోజ్ (నాటౌట్) 10; గుర్నూర్ బ్రార్ (సి) దూబే (బి) యశ్ ఠాకూర్ 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (69.5 ఓవర్లలో ఆలౌట్) 214.వికెట్ల పతనం: 1–52, 2–73, 3–105, 4–119, 5–124, 6–142, 7–175, 8–191, 9–191, 10–214. బౌలింగ్: హర్శ్ దూబే 22–5–58–2; ఆదిత్య ఠాకరే 11–1–40–1; దర్శన్ నల్కండే 8–1–26–1; యశ్ ఠాకూర్ 16.5–3–66–4; పార్థ్ రెఖడే 12–3–24–2. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్‌దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్నూర్ బ్రార్ 37; ధ్రువ్ షోరె (బ్యాటింగ్) 24; దానిశ్ మాలేవార్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–42, 2–64. బౌలింగ్: సారాంశ్ జైన్ 9–0–28–0; ఆకాశ్‌దీప్ 3–1–4–0; మానవ్ సుతార్ 14–1–35–1; అన్షుల్ కంబోజ్ 4–0–14–0; గుర్నూర్ బ్రార్ 6–2–11–1. చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్.. -
నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్
ఇరానీ కప్ 2025లో (Irani Cup 2025) రంజీ ఛాంపియన్ విదర్భ జట్టు (Vidarbha) బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడతాడు) చెలరేగిపోయాడు. 16.5 ఓవర్లలో 66 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. యశ్ ధాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest Of India) 214 పరుగులకే ఆలౌటైంది.ఆట మూడో రోజైన ఇవాళ (అక్టోబర్ 3) రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్‌నైట్ స్కోర్‌కు (124/5) మరో 90 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్, రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రజత్ పాటిదార్ (66) పోరాడినంత సేపు పోరాడి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇవాల్టి ఆటలోనే యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. ఆట ప్రారంభం నుంచే యశ్ నిప్పులు చెరిగాడు. ఇవాళ హర్ష్ దూబే, ఆదిత్య ఠాకరే తలో వికెట్ తీశారు.మొత్తంగా యశ్ ఠాకూర్ 4, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే చెరో 2, ఆదిత్య ఠాకరే, దర్శన్ నల్కండే తలో వికెట్ తీశారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (52) మాత్రమే రాణించాడు. ఈ జట్టులో ఉన్న టీమిండియా ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 342 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (143) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా విదర్భ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు.అమన్ మొఖడే 19, ధృవ్ షోరే 18, దనిశ్ మాలేవార్ డకౌట్, కెప్టెన్ అక్షయ్ వాద్కర్ 5, యశ్ ఠాకూర్ 11, హర్ష్ దూబే డకౌట్, దర్శన్ నల్కండే 20, ఆదిత్య ఠాకరే 2 పరుగులకు ఔటయ్యారు.రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, ఆకాశ్‌దీప్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్ 2, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో వికెట్ తీశారు. కాగా, ఇరానీ ట్రోఫీ అనేది రంజీ ఛాంపియన్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతుంది.చదవండి: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ -
మయాంక్‌కు గాయం.. లక్నో హీరోగా యశ్! ఎవరీ యంగ్ పేసర్?
ఒకరి దురదృష్టం.. మరొకరికి అదృష్టంగా మారడం అంటే ఇదేనేమో! అరంగేట్రంలోనే సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్‌ను గెలిపించి.. రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు మయాంక్ యాదవ్. తద్వారా ఐపీఎల్ పదిహేడేళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్పీడ్‌గన్. బుల్లెట్ వేగంతో బంతులు సంధించే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ లక్నోను గెలిపించి.. హ్యాట్రిక్ అందుకుంటాడని అభిమానులు భావించారు. కానీ దురదృష్టవవాత్తూ పక్కటెముల నొప్పి కారణంగా మయాంక్ యాదవ్ ఒక్క ఓవర్ మాత్రమే పూర్తి చేసి.. ఆ తర్వాత మైదానం వీడాడు. అతడి స్థానంలో వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం దక్కించుకున్న యశ్ ఠాకూర్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్-2024లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. 3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి శుబ్‌మన్ గిల్(19), విజయ్ శంకర్(17), దర్శన్ నల్కండే(12), రాహుల్ తెవాటియా(30), రషీద్ ఖాన్(0) వికెట్లు దక్కించుకున్నాడు. 2️⃣nd win at home 👌 3️⃣rd win on the trot 👌 A superb performance from Lucknow Super Giants takes them to No. 3 in the points table 👏👏 Scorecard ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/w2nCs5XrwT — IndianPremierLeague (@IPL) April 7, 2024 ఎవరీ యశ్ ఠాకూర్? కోల్‌కతాలో 1998లో జన్మించిన యశ్ ఠాకూర్.. దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ రైటార్మ్ మీడియం పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు. రూ. 45 లక్షలకు కొనుగోలు ఐపీఎల్-2023 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ యశ్ ఠాకూర్‌ను రూ. 45 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి యశ్ 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇది నీ రోజు అని చెప్పాడు ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి యశ్ ఠాకూర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. గిల్‌ను అవుట్ చేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కేఎల్ రాహుల్ సర్ సలహాలతో వ్యూహాలను సరిగ్గా అమలు చేయగలిగాను. దురదృష్టవశాత్తూ మయాంక్ గాయపడ్డాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ నా దగ్గరికి వచ్చి ఇది నీ రోజు.. ఉపయోగించుకో అని మోటివేట్ చేశాడు’’ అని యశ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశాడు. 5️⃣-fer ✅ Victory ✅ Celebration 🥳✅#LSGvGT #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/21U2dH6t2H — JioCinema (@JioCinema) April 7, 2024 లక్నో వర్సెస్ గుజరాత్ స్కోర్లు: ►వేదిక: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 163/5 (20) ►గుజరాత్ స్కోరు: 130 (18.5). ►ఫలితం: 33 పరుగుల తేడాతో లక్నో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశ్ ఠాకూర్(5/30). చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్


