గంభీర్‌ ఫేవరెట్‌ ప్లేయర్‌ అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ | BCCI Announces Harshit Rana Replacement IND vs AFG Asian Games 2026 | Sakshi
Sakshi News home page

గంభీర్‌ ఫేవరెట్‌ ప్లేయర్‌ అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Sep 10 2026 1:18 PM | Updated on Sep 10 2026 1:53 PM

BCCI Announces Harshit Rana Replacement IND vs AFG Asian Games 2026

యశ్‌ ఠాకూర్‌ (PC: BCCI X)

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్‌ హర్షిత్‌ రాణా ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్‌.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.

మరోసారి గాయం
ఈ క్రమంలో హర్షిత్‌ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్‌నెస్‌ ఆధారంగా టీ20 సిరీస్‌ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్‌ రాణా మరోసారి గాయపడ్డాడు. 

మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్‌ చేస్తున్న సందర్భంగా హర్షిత్‌కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.

హర్షిత్‌ స్థానంలో అతడే
ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్‌ రాణా స్థానంలో యశ్‌ ఠాకూర్‌ను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.

ఇరవై ఏడేళ్ల యశ్‌ ఠాకూర్‌ కుడిచేతి వాటం ఫాస్ట్‌ మీడియం పేసర్‌. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్‌ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్‌ ఠాకూర్‌,, ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్‌లు ఆడిన యశ్‌ ఠాకూర్‌.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్‌లో ఇప్పటికి 22 మ్యాచ్‌లు ఆడిన యశ్‌ ఠాకూర్‌ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు యశ్‌. 

గోల్డెన్‌ ఛాన్స్‌
ఇక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్‌ ఠాకూర్‌ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్‌ రాణా దూరం కావడంతో అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశాడు. 

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేటెడ్‌)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్  (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్ దూబే, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశ్‌ ఠాకూర్‌.

ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్‌డేటెడ్‌)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్  (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్ దూబే, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశ్‌ ఠాకూర్‌.

చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్‌ పెట్టండి.. మా కింగ్‌ ఆడతాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement