Photo Credit: BCCI Twitter
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్‌లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వారు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.
సుందర్ ఒక్కడే.. హర్షిత్ డౌట్!
ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లకు సంబంధించి ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ తీసుకొని టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హర్షిత్ రానా ఫిట్‌గా ఉన్నట్లు సమాచారమున్నప్పటికీ అతడికి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు బుమ్రా, నితీశ్‌రెడ్డిలు మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మెడికల్ టీం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది.
"సుందర్ ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ పొందాడు. సెప్టెంబర్ 4న నిర్వహించిన సిములేషన్ ఎక్సర్‌సైజ్‌లో సుందర్ క్లియరెన్స్ పొందాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బుమ్రా, నితీశ్‌రెడ్డి, హర్షిత్ రానాలు మ్యాచ్ సిములేషన్‌కు పంపించాము. అయితే సిములేషన్‌లో ఈ ముగ్గురికి సంబంధించిన రిజల్ట్‌లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం.
అందుకే ఇవాళ మరోసారి ఈ ముగ్గురిని సిములేషన్ ఎక్సర్‌సైజ్‌కు పంపాలని నిర్ణయించాం. ఆ తర్వాత ఈ ముగ్గురి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు సంబంధించిన రిపోర్ట్ వివరాలను వెల్లడిస్తాం" అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధుల బృందం తెలిపింది.
బుమ్రా దూరం.. నితీశ్ కూడా!
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు బుమ్రా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రానా మాత్రం ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించడంతో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి మాత్రం ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడడని, అతడిని నేరుగా ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు పంపించనున్నట్లు సీవోఈ మరో ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే హర్షిత్ రానా కూడా కండరాల గాయంతో రీహాబిలిటేషన్ సెంటర్‌కు వచ్చేశాడు. నితీశ్‌రెడ్డి కూడా కండరాల గాయంతోనే ఇంగ్లండ్‌తో పాటు లంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారు.
🚨 UPDATE ON BUMRAH, NITISH & HARSHIT 🚨
- Harshit Rana is fully fit and should be play in T20I series against Afghanistan.
- Jasprit Bumrah is unlikely for T20i series against Afghanistan.
- Nitish Kumar Reddy is doubtful for T20i series against Afghanistan & he is most… pic.twitter.com/pisBr2amZL— M A N U. (@Manu_1845) September 9, 2026


