టీమిండియా (PC: BCCI X)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చే రెండేళ్ల పాటు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి మూడు సంస్థలను అసోసియేట్ స్పాన్సర్లుగా ఎంచుకుంది.
క్యాంపా కోలా, ఎస్‌బీఐ లైఫ్‌తో పాటు చాట్ జీపీటీతో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో సిరీస్ మొదలు 2028 మార్చి కొనసాగే ఈ కాంట్రాక్ట్‌లో భారత్ 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
ఈ స్పాన్సర్‌షిప్ విలువ సుమారు రూ.130 కోట్లుగా ఉందని ప్రకటించిన బీసీసీఐ... గతంతో పోలిస్తే ఇది దాదాపు 44 శాతం ఎక్కువ అని ప్రకటించింది. విడివిడిగా బోర్డు వివరాలు వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు క్యాంపా కోలా రూ.1.31 కోట్లను చెల్లించనుండగా... ఎస్‌బీఐ లైఫ్, చాట్ జీపీటీ మ్యాచ్‌కు రూ.1.20 కోట్లు చొప్పున చెల్లిస్తాయి.
ఇదీ చదవండి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ టీ20 లీగ్ టోర్నీ ‘బిగ్‌బాష్‘ను 15 సీజన్ల పాటు నిర్వహించింది. ఇప్పటి వరకు టోరీ్నకి సొంతదారుగా సీఏనే వ్యవహరించింది. జట్లతో పాటు టోర్నీల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపికవంటి అంశాలన్నీ స్వయంగా బోర్డు పర్యవేక్షణలోనే జరిగాయి.
అయితే ఇప్పుడు లీగ్‌లో ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని సీఏ నిర్ణయించింది. లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడుల అనుమతికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ క్రమంలో ముందుగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టులో 100 శాతం వాటా అమ్మకానికి పచ్చ జెండా ఊపింది.
ఆటగాళ్ల చెల్లింపులు, టీమ్ విలువ, క్రికెటర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోయినా సీఏ ముందుకు వెళ్లడం ఆసీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇవన్నీ తేలిన తర్వాతే బిగ్ బాష్‌కు సంబంధించిన ఎంఓయూలపై ఒప్పందం కుదరవచ్చని తెలుస్తోంది.


