IND vs AUS: భారత జట్టులో మార్పులు.. ప్రకటించిన బీసీసీఐ | IND vs AUS: BCCI Announces 2 Changes In India Under 19 Squad | Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత జట్టులో మార్పులు.. ప్రకటించిన బీసీసీఐ

Sep 8 2026 10:48 AM | Updated on Sep 8 2026 12:03 PM

IND vs AUS: BCCI Announces 2 Changes In India Under 19 Squad

భారత అండర్‌-19 జట్టు (PC: BCCI X)

ఆస్ట్రేలియాతో తలపడే అండర్‌-19 జట్లలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్పులు చేసింది. రోహిత్‌ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో యూత్‌ వన్డే, యూత్‌ టెస్టులకు ఇద్దరు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అవును.. అది నిజమే
కాగా దేశీ క్రికెట్‌లో బెంగాల్‌కు ఆడుతున్న లెగ్‌ స్పిన్నర్‌ రోహిత్‌ యాదవ్‌. వయసుకు సంబంధించి అతడు పత్రాలు సమర్పించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

‘‘ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టుతో రాజ్‌కోట్‌, అహ్మాదాబాద్‌ వేదికలుగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించి భారత అండర్‌-19 జట్టు నుంచి రోహిత్‌ వైదొలిగాడు. తన వయసుకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేకపోయినందున జట్టు నుంచి తప్పుకొన్నాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

ఇద్దరికి అవకాశం
ఇక రోహిత్‌ యాదవ్‌ నిష్క్రమణ నేపథ్యంలో జూనియర్‌ క్రికెట్‌ కమిటీ ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆసీస్‌తో యూత్‌ వన్డేలకు సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్‌ సావ్‌సానీ, యూత్‌ టెస్టులకు హర్యానా ప్లేయర్‌ తన్మయ్‌ బలోడాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరు 18- అక్టోబరు 8 మధ్య భారత్‌- ఆసీస్‌ మధ్య మూడు యూత్‌ వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు జరుగుతాయి.

ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో యూత్‌ వన్డేలకు భారత అండర్‌-19 జట్టు (అప్‌డేటెడ్‌)
లక్ష్యా రాయ్‌చందాని (కెప్టెన్‌), యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (వైస్‌ కెప్టెన్‌), రజత్‌ భగేల్‌ (వికెట్‌ కీపర్‌),ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, వీకే వినీత్‌, కుశాగ్రా ఓజా, అర్జున్‌ రాజ్‌పుత్‌, మనాల్‌ చౌహాన్‌, అన్వయ్‌ ద్రవిడ్‌ (వికెట్‌ కీపర్‌), వి.యశ్‌వీర్‌, శవిన్‌ వినోద్‌, మోహిత్‌ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్‌, ఆర్యన్‌ సావ్‌సానీ.

యూత్‌ టెస్టులకు భారత అండర్‌-19 జట్టు (అప్‌డేటెడ్‌)
యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (కెప్టెన్‌), లక్ష్యా రాయ్‌చందాని (వైస్‌ కెప్టెన్‌), సాగర్‌ విర్క్‌, కుశాగ్రా ఓజా, మనాల్‌ చౌహాన్‌, కుశ్‌ పటేల్‌, మానవ్‌ కృష్ణ (వికెట్‌ కీపర్‌), అభిప్రాయ్‌ బిస్వాస్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ ఓమ్‌, అయాన్‌ అక్రం, ప్రణవ్‌ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్‌, మోహిత్‌ ఉల్వా, ఆర్యన్‌ యాదవ్‌, తన్మయ్‌ బలోడా.

చదవండి: టీమిండియాతో ఏకైక టీ20.. జట్టును ప్రకటించిన జపాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement