breaking news
Youth Tests
-
టీమిండియా ప్లేయర్ ప్రపంచ రికార్డు
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో భారత్ అండర్-19 స్పిన్నర్ తన్మయ్ బలోడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆఖరి నిమిషంలో రోహిత్ యాదవ్ స్ధానంలో జట్టులో చోటు దక్కించుకున్న తన్మయ్ తన స్పిన్ మాయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లతో ఈ యువ స్పిన్నర్ సత్తాచాటాడు. ఈ క్రమంలో తన్మయ్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. యూత్ టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా బలోడా నిలిచాడు.సౌథీ రికార్డ్ బ్రేక్ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ లెజెండరీ పేసర్ టిమ్ సౌథీ పేరిట ఉండేది. 2007లో భారత్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌథీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 92 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 73 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టిన తన్మయ్.. సౌథీ 19 ఏళ్ల సౌథీ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. పర్యాటక జట్టు బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 151 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ ముందు కేవలం 11 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లలో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. -
టీమిండియాతో మ్యాచ్.. ఆసీస్ పేసర్ సరికొత్త చరిత్ర! 39 ఏళ్ల తర్వాత
అహ్మదాబాద్ వేదికగా భారత్ అండర్-19తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్ ఓటమి పాలైంది. కంగారులు నిర్ధేశించిన 11 పరుగల స్వల్ప లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది. అంతకుముందు ఆసీస్ యువ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌లో విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి కేవలం 151 పరుగులకే కుప్పకూలింది.తొలి ఇన్నింగ్స్‌లో కూడా 174 పరుగులకు ఆసీస్ ఆలౌటైంది. భారత్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు పేసర్ స్పెన్సర్ గ్రీన్ మాత్రం ఓ అరుదైన రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.39 ఏళ్ల తర్వాతస్పెన్సర్ గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 28 ఓవర్లలో 110 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా యూత్ టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో ప్లేయర్‌గా గ్రీన్ నిలిచాడు. ఇంతకుముందు 1987లో జరిగిన ఓ యూత్ టెస్ట్ మ్యాచ్‌లో స్కాట్ ప్రెస్ట్‌విడ్జ్ 30 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. మళ్లీ 39 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను గ్రీన్ నమోదు చేశాడు. కాగా భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా సైతం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
IND vs AUS: తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
భారత అండర్-19 క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా యూత్ టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.టాస్ గెలిచిన ఆసీస్రాజ్కోట్ వేదికగా ఆదివారం మొదలైన తొలి యూత్ టెస్టులో ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఆసీస్ జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నిరంజన్ షా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చెలరేగిన ఇషాన్ ఓంభారత బౌలర్ల ధాటికి తాళలేక కంగారూ టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్ కాస్త మెరుగ్గా రాణించింది. ఓపెనర్లు నీల్ పటేల్ (11), హేడేన్ బార్బూలోవిక్ (0).. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ మాథ్యూ లాఫ్ (1) తేలిపోయారు. నాలుగో స్థానంలో వచ్చిన జేడ్ హాలిక్ అర్ధ శతకం (59) చేయగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్లేక్ క్యాటిల్ (102) శతక్కొట్టాడు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్ ఇషాన్ ఓమ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ మోహిత్ ఉల్వా మూడు వికెట్లు కూల్చాడు. కెప్టెన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ యశ్వర్దన్ చౌహాన్ రెండు వికెట్లు తీశాడు.లక్ష్య డబుల్ సెంచరీఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా 494 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందాని ఆసీస్‌పై రికార్డు డబుల్ సెంచరీ (281 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు: 240)తో చెలరేగగా.. కెప్టెన్ యశ్వర్దన్ అర్ధ శతకం (54)తో రాణించాడు.లోయర్ ఆర్డర్లో ఊహించని రీతిలో పదో నంబర్ బ్యాటర్ మోహిత్ ఉల్వా 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ మానవ్ కృష్ణ 25, ఆయాన్ అక్రం 26 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్ మూడు వికెట్లు తీయగా.. థియో సింగోస్, స్పెన్సర్ గ్రీన్, కొనొర్ గ్రెగరీ తలా రెండు.. ఎలి బ్రేయిన్ ఒక వికెట్ తీశారు.ఈసారి కెప్టెన్ సాబ్ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 277 పరుగుల భారీ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ 229 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ మీద 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈసారి కూడా ఇషాన్ ఓం నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్వర్దన్ అనూహ్యంగా ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి యూత్ టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్- 494👉ఆస్ట్రేలియా- 217 & 229👉ఫలితం: ఆసీస్‌పై ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో భారత్ గెలుపు.చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో వన్డే.. భారత తుదిజట్టులో మార్పు! -
IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డు
భారత యువ క్రికెటర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇంత వరకు ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. మూడు అనధికారిక వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆసీస్ అండర్-19 జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా లక్ష్య కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను యువ భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.217 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా ఆదివారం తొలి యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌట్ అయింది. బ్లేక్ క్యాటిల్ సెంచరీ (102) చేయగా.. జేడ్ హాలిక్ (59) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో ఇషాన్ ఓమ్ ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత అండర్-19 జట్టు.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 494 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఇందులో ఓపెనర్ లక్ష్య రాయ్చందానిదే కీలక పాత్ర.డబుల్ సెంచరీతో దుమ్ములేపిన లక్ష్యఆసీస్తో తొలి యూత్ టెస్టులో లక్ష్య.. ద్విశతకంతో కదంతొక్కాడు. ఈ కుడిచేతివాటం బ్యాటర్ మొత్తంగా 281 బంతులు ఎదుర్కొని 240 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ప్రపంచ రికార్డుఈ క్రమంలోనే ఆసీస్‌పై యూత్ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా లక్ష్య ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో పాకిస్తాన్ ఆటగాడు ఆస్ట్రేలియతో యూత్ టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 175 పరుగులు చేసి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లక్ష్య ఈ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో లక్ష్య థియో సింగోస్ బౌలింగ్‌లో ఎలి బ్రేయిన్‌కు క్యాచ్ ఇవ్వడంతో లక్ష్య పెవిలియన్ చేరాల్సి వచ్చింది.మరో ఘనతఇక ఓవరాల్‌గా యూత్ టెస్టుల్లో అత్యధిక రెండో వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడినూ లక్ష్య నిలిచాడు. 2018లో శ్రీలంకతో యూత్ టెస్టులో భారత ఆటగాడు పవన్ షా 282 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇదిలా ఉంటే.. లక్ష్యతో పాటు కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (54), మోహిత్ ఉల్వా (92) రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. ఆసీస్ కంటే 227 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది.చదవండి: Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం -
IND vs AUS: భారత జట్టులో మార్పులు.. ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో తలపడే అండర్-19 జట్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్పులు చేసింది. రోహిత్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో యూత్ వన్డే, యూత్ టెస్టులకు ఇద్దరు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.అవును.. అది నిజమేకాగా దేశీ క్రికెట్లో బెంగాల్‌కు ఆడుతున్న లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్. వయసుకు సంబంధించి అతడు పత్రాలు సమర్పించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘‘ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో రాజ్‌కోట్, అహ్మాదాబాద్ వేదికలుగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించి భారత అండర్-19 జట్టు నుంచి రోహిత్ వైదొలిగాడు. తన వయసుకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేకపోయినందున జట్టు నుంచి తప్పుకొన్నాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.ఇద్దరికి అవకాశంఇక రోహిత్ యాదవ్ నిష్క్రమణ నేపథ్యంలో జూనియర్ క్రికెట్ కమిటీ ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆసీస్‌తో యూత్ వన్డేలకు సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్ సావ్సానీ, యూత్ టెస్టులకు హర్యానా ప్లేయర్ తన్మయ్ బలోడాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరు 18- అక్టోబరు 8 మధ్య భారత్- ఆసీస్ మధ్య మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరుగుతాయి.ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డేలకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)లక్ష్యా రాయ్‌చందాని (కెప్టెన్), యశ్వర్దన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ భగేల్ (వికెట్ కీపర్),ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్రా ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి.యశ్వీర్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్, ఆర్యన్ సావ్సానీ.యూత్ టెస్టులకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)యశ్వర్దన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్యా రాయ్‌చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్రా ఓజా, మనాల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), ఇషాన్ ఓమ్, అయాన్ అక్రం, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్, తన్మయ్ బలోడా.చదవండి: టీమిండియాతో ఏకైక టీ20.. జట్టును ప్రకటించిన జపాన్ -
భారత్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా సీనియర్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, తాజాగా వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న అండర్-19 మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం 16 మందితో జట్టును ప్రకటించింది. కేసీ బార్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, విల్ బైరోమ్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. 16 మందిలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ మాత్రమే జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆడారు. ఇక ఇదే జట్టులో భారత సంతతి కుర్రాడు, గుజరాత్‌కు చెందిన నీల్ పటేల్ చోటు దక్కించుకున్నాడు.ఇక జట్టులో క్వీన్స్లాండ్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉండగా, విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్ నుంచి ముగ్గురేసి, తస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి మిగిలిన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మ్యాచ్‌లన్నీ రాజ్‌కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.భారత్‌లో ఆసీస్ సిరీస్ షెడ్యూల్👉తొలి యూత్ వన్డే – శుక్రవారం, సెప్టెంబర్ 18👉రెండో యూత్ వన్డే – సోమవారం, సెప్టెంబర్ 21👉మూడో యూత్ వన్డే – బుధవారం, సెప్టెంబర్ 23👉మొదటి యూత్ టెస్ట్ – ఆదివారం, సెప్టెంబర్ 27-30 వరకు👉రెండో యూత్ టెస్ట్ – సోమవారం, అక్టోబర్ 5-8 వరకుభారత్లో సిరీస్ నిర్వహణ ఎందుకంటే?ఇండియా అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్లో సిరీస్ నిర్వహణ ఎందుకు అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అధికారిణి సొన్యా థాంప్సన్ వివరణ ఇచ్చారు. "మా పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని కొంతమంది అత్యుత్తమ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలను కల్పించి వారిని ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కఠిన పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సాంకేతికంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. భారత్‌లో పర్యటించడం, సవాలుతో కూడిన పరిస్థితుల్లో అత్యున్నత స్థాయి ప్రత్యర్థులతో తలపడడం ద్వారా అనుభవంతో కూడిన పాఠాలు నేర్చుకుంటారు. ఇది అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లను సాంకేతికంగా, మానసికంగా పరీక్షిస్తుంది," అని థాంప్సన్ తెలిపారు. మరోవైపు ఆసీస్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు భారత అండర్-19 జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.ఆస్ట్రేలియా అండర్-19 జట్టు:కేసీ బార్టన్ (కెప్టెన్), హేడెన్ బార్బులోవిక్, ఎలీ బ్రెయిన్, విల్ బైరోమ్ (వైస్ కెప్టెన్), బ్లేక్ క్యాటిల్, జాక్ జోస్నెక్, స్పెన్సర్ గ్రీన్, కానర్ గ్రెగొరీ, చార్లీ హెండర్సన్, జెడ్ హోలిక్, మాథ్యూ లాఫ్, నీల్ పటేల్, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థియో సింగోస్, థామస్ వాసియో.Introducing our Australian Men's Under 19 squad to tour India next month 👋 pic.twitter.com/1z8Vf6erj7— Cricket Australia (@CricketAus) August 2, 2026చదవండి: విండీస్‌కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్‌తో! -
IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
భారత అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటికి మెజారిటీ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ ఒంటిచేత్తో జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య గాలె వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్లు దుల్నిత్ సిగెర (0), దిమంత మహవితన (2) వికెట్లు కోల్పోయింది.సెనుజ డబుల్ సెంచరీఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ ఆచితూచి ఆడుతూ క్రీజులో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి రోజు ఆటలోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో రాణించగా.. కవిజ గమాగే 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ఈ క్రమంలో సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 344 పరుగులు సాధించింది. ఇక 344/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 9 వికెట్ల నష్టానికి 424 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.సెనుజ వెకునగొడ మొత్తంగా 267 బంతుల్లో 33 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 233 పరుగులు సాధించాడు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన అతడిని జగన్నాథన్ హెంచుదేశన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు.వర్షం వల్ల నిలిచిన ఆటఇక మిగిలిన వారిలో చమిక హీనతిగల 45 పరుగులు చేయగా.. పదకొండో నంబర్ బ్యాటర్ ఒషాడా మనాహర అనూహ్య రీతిలో 12 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జగన్నాథన్ హెంచుదేశన్ మూడు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, ప్రియాన్షు సింగ్ చెరో రెండు.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి భారత జట్టు ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసి.. లంక కంటే 399 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని 16, సాగర్ విర్క్ 8 పరుగులతో క్రీజులో నిలిచారు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్-19 జట్టును ప్రకటించింది. యశ్వర్దన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్-డే మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ పంథా మార్చింది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్వర్దన్ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్‌కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో ఆడిన భారత్- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్‌లో ఏకైక మ్యాచ్ ఆడిన అన్వయ్.. అఫ్గన్ బౌలర్ నజీఫుల్లా అమిరి బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్ వి, కావ్యా పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా. ఇషాన్ సూద్.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్ అండర్-19 వర్సెస్ శ్రీలంక అండర్-19 షెడ్యూల్ (మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు)👉హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్ టెస్టు.చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
చారిత్రక టూర్ ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. తమ అండర్-19 జట్టును ఇంగ్లండ్ పర్యటనకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఒక ఫోర్ డే మ్యాచ్‌తో పాటు నాలుగు యూత్ వన్డేలు ఆడననున్నట్లు తెలిపింది.కాగా పాక్ అండర్-19 జట్టు చివరగా 2023లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాడు రెండు యూత్ టెస్టులతో పాటు ఐదు యూత్ వన్డేలు ఆడింది. టెస్టు సిరీస్ డ్రా కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.భవిష్య ఈవెంట్లకు సన్నాహకంగా..ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి యంగ్ షాహిన్స్ జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. కాగా పాక్ అండర్-19 టీమ్ గతేడాది కాలంగా మంచి ఫామ్‌లో ఉంది. ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత జట్టును ఓడించి టైటిల్ గెలిచింది.ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజయం సాధించింది. జింబాబ్వే, అఫ్గనిస్తాన్‌లపై గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2025 టోర్నీలో మాత్రం పాక్ ఐదింట కేవలం మూడే గెలిచింది. ఇంగ్లండ్‌తో పాటు భారత్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ఈ టోర్నీలో యువ భారత జట్టు గెలుపొంది.. ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇదిలా ఉంటే.. రానున్న ఐసీసీ ఈవెంట్లకు సన్నాహకంగా పాక్ అండర్-19 జట్టుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులపై పాక్ యువ ఆటగాళ్లు అవగాహన పెంపొందించుకునేలా ఈ టూర్ ఉపయోగపడనుంది. ఆసియా కప్‌తో పాటు భవిష్య ముక్కోణపు సిరీస్‌లకు ఈ పర్యటన ద్వారా మంచి ప్రాక్టీస్ దొరకనుంది.ఇంగ్లండ్ అండర్-19 వర్సెస్ పాక్ అండర్-19 సిరీస్ షెడ్యూల్👉యూత్ టెస్టు: సెప్టెంబరు 2-5- అరుండేల్👉తొలి యూత్ వన్డే: సెప్టెంబరు 9- అరుండేల్👉రెండో యూత్ వన్డే: సెప్టెంబరు 12- గిల్డ్‌ఫోర్డ్👉మూడో యూత్ వన్డే: సెప్టెంబరు 14- వార్మ్స్లే👉నాలుగో యూత్ వన్డే: సెప్టెంబరు 16- వార్మ్స్లే.చదవండి: నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా? -
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్!
భారత క్రికెట్లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్ బ్లాస్టర్’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు కెప్టెన్‌గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.సెంచరీల మోతచెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (104)తో యూత్ టెస్టులో శతక్కట్టిన వైభవ్.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్... ఆస్ట్రేలియాలో యూత్ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్ తరఫున దేశీ క్రికెట్లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్‌లో యూఏఈ అండర్-19 జట్టుతో యూత్ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్‌పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.ఆరు దేశాల్లో ఆరు సెంచరీలుఇలా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఖతార్, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.ఏంటి తమ్ముడూ ఇది!ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.సంజూ శాంసన్ స్థానంలోఅండర్-19 వరల్డ్‌కప్-2026లో అతడు షోటాపర్ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్.. రాజస్తాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్ జాతరే!అతడి పట్టుదల, టెంపర్మెంట్, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్‌ను రాజస్తాన్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన విషయం తెలిసిందే.ఓపెనింగ్ స్థానానికి ఎసరుఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్ స్థానానికి వైభవ్ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడితే.. క్రికెట్ దేవుడు, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్‌లో 2011, మార్చి 27న వైభవ్ సూర్యవంశీ జన్మించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. ఒక్క పరుగు తేడాతో.. -
సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కోపమొచ్చింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం కారణంగా అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో సత్తా చాటిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలోనూ..ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో యూత్ వన్డే, టెస్టుల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆసీస్ అండర్-19 జట్టుతో యూత్ వన్డేల్లో మూడు మ్యాచ్‌లలో వరుసగా 38, 70, 16 పరుగులు చేసిన వైభవ్.. సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.ఇక ఆసీస్ అండర్-19 జట్టుతో తొలి యూత్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర శతకంతో చెలరేగడం విశేషం. కేవలం 86 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 113 పరుగులు రాబట్టాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 58 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.HUNDRED FOR 14-YEAR-OLD VAIBHAV SURYAVANSHI IN AUSTRALIA Smashed a brilliant 100 off 78 balls vs Australia U-19 at Ian Healy Oval. A future star in the making!#vaibhavsuryavanshi pic.twitter.com/ZWE0GTNBN1— Rupeshh Suryavanshi (@RupeshSurya288) October 1, 2025ఆసీస్ 135 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో భారత్- ఆసీస్ అండర్-19 జట్ల మధ్య మంగళవారం (అక్టోబరు 7) రెండో యూత్ టెస్టు మొదలైంది. మెకాయ్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ లీ యంగ్ (66) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఉద్ధవ్ మోహన్ రెండు, దీపేశ్ దేవేంద్రన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. విల్ బైరోమ్ బౌలింగ్ అలెక్స్టర్నర్కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (11) కూడా విఫలమయ్యాడు.ఊహించని విధంగా..ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ సత్తా చాటుతాడని ఆశించగా.. అందుకు తగ్గట్లుగానే దూకుడుగా తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నవేళ.. ఊహించని విధంగా అవుటయ్యాడు.చార్ల్స్ లచ్మండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. అయితే, అంపైర్ నిర్ణయం పట్ల వైభవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి బ్యాట్ కంటే ముందు ప్యాడ్‌కు తాకిందని వైభవ్ అంపైర్‌తో వాదించినట్లు కనిపించింది.సహనం కోల్పోయిన వైభవ్ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్ అవుటైన కాసేపటి దాకా క్రీజును వీడకుండా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అన్యమస్కకంగానే పెవిలియన్ చేరాడు. ఇక వైభవ్‌తో పాటు మరో ఎండ్‌లో ఉన్న వేదాంత్ త్రివేవది కూడా అంపైర్‌తో ఇదే విషయం గురించి కాసేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Vaibhav Suryavanshi was wrongly given out in the second Youth Test against Australia U19. He looked shocked by the decision and gestured to indicate that there was a clear gap between the bat and the ball. pic.twitter.com/En8tKe4ErE— Varun Giri (@Varungiri0) October 7, 2025 ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వైభవ్ 20 పరుగులు చేయగా.. వేదాంత్ 25, ఖిలన్ పటేల్ 26 పరుగులు చేశారు. హెనిల్ పటేల్ 22, దీపేశ్ దేవేంద్రన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: రోహిత్‌ను తప్పించడం సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్


