నష్రా సంధుకు 6 వికెట్లు సెమీఫైనల్లో పాకిస్తాన్‌ | Pakistan booked their place in the Womens Asia Cup semi-finals | Sakshi
Sakshi News home page

నష్రా సంధుకు 6 వికెట్లు సెమీఫైనల్లో పాకిస్తాన్‌

Sep 8 2026 5:56 AM | Updated on Sep 8 2026 5:56 AM

Pakistan booked their place in the Womens Asia Cup semi-finals

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నిలో పాకిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ 72 పరుగుల తేడాతో హాంకాంగ్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్‌ (47), ఆయేషా జఫర్‌ (26), ఫాతిమా సనా (24 నాటౌట్‌) రాణించారు. హాంకాంగ్‌ బౌలర్‌ జాయ్‌లీన్‌ కౌర్‌ 4 వికెట్లు పడగొట్టింది. 

అనంతరం హాంకాంగ్‌ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై నెగ్గి... భారత్‌ చేతిలో చిత్తయిన పాక్, ఈ గెలుపుతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నేడు జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ జట్టుతో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement