breaking news
Nashra Sandhu
-
షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు!
మహిళల ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే పాక్ సెమీస్ బెర్తు కంటే పాక్ ప్లేయర్స్ ధరించి షూస్(Footwear)కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. నష్రా సంధు, ఐమన్ ఫాతిమా కోహ్లి వన్8 బ్రాండ్ షూతో కనిపించినప్పటికీ, జట్టులో దాదాపు అందరు ప్లేయర్లు ఇదే బ్రాండ్ షూను ధరించినట్లు తెలుస్తోంది.పాక్ జట్టులో ప్రతీ మహిళా ప్లేయర్ ‘వన్8’ (one8) బ్రాండ్ షూనే ధరించారు. ఈ ‘వన్8’ ఫుట్‌వేర్ బ్రాండ్ మరెవరిదో కాదు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇదే ‘వన్8’ షూకు సహ యజమానిగా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేనప్పటికీ, పాక్ ఆటగాళ్లు తమ సొంత బ్రాండ్‌ను వదిలేసి టీమిండియా ఐకాన్ ప్లేయర్‌కు చెందిన బ్రాండ్‌తో అసోసియేట్ అవ్వడమే ఇక్కడ విశేషం. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన అభిమానులు.. ‘‘పాక్ ఆటగాళ్లకు సొంత బ్రాండ్ అనేది లేదు. తాము ధరించే షూస్‌పై కూడా భారత్ బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ మన భారత్ బ్రాండ్.’’ అని కామెంట్లు చేయడం ఆసక్తి కలిగించింది.కోహ్లీతో అనుబంధం దృష్ట్యా ‘వన్8’ కంపెనీ షూస్‌తో పాటు దుస్తులు, ఇతర క్రీడా ఉత్పత్తులను అందించే స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌గా విస్తరించింది. ఈ బ్రాండ్‌ను తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్న అగిలిటాస్, వన్8ను కోహ్లీతో కలిసి స్థాపించిన స్పోర్ట్స్‌వేర్ లేబుల్గా అభివర్ణిస్తుంది. అంతేకాదు కోహ్లి ‘వన్8’ పార్టనర్ ‘అగిలిటాస్’లో పెట్టుబడిదారుడు కూడా. కోహ్లి ఈ కంపెనీలో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్‌లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది.Many players of Pakistan women team was wearing @one8world shoes in asia cup match.I have following questions 1. Products registered in india can't be exported to pak ,so did this deal happened in Dubai? Where matches are being played2.Aisi kya majburi thi @one8world pic.twitter.com/GkVdg3BfUG— varun (@mystic_varunn) September 7, 2026 देखिए पाकिस्तानी महिला क्रिकेटर ईमान फातिमा विराट कोहली के One8 ब्रांड के जूते पहने हुए हैं। 👀पाकिस्तानी खिलाड़ी भी वो अपने खुद के देश के ब्रांड्स से ज्यादा कोहली के ब्रांड पर भरोसा करती हैं।कुछ फैंस कह रहे हैं कि उसने ये जूते स्मृति के किट बैग से चुराए हैं🤣 pic.twitter.com/n5zMtQicDR— Indian🇮🇳 (@singh31919) September 9, 2026Read: ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్! -
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నిలో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్‌లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై నెగ్గి... భారత్ చేతిలో చిత్తయిన పాక్, ఈ గెలుపుతో గ్రూప్ ‘ఎ’ నుంచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ జట్టుతో బంగ్లాదేశ్ తలపడుతుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. -
పాక్ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్ బ్యాటర్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్‌కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బౌలర్ల విజృంభణకెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్‌ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది.పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్‌రౌండర్ అలనా కింగ్‌తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్‌లో సదాఫ్ షమాస్కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లుమరో ఎండ్‌లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌పై బ్యాట్‌తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025 -
బైక్‌పై మహిళా క్రికెటర్..
లాహోర్: పాకిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రపంచకప్ టోర్ని నుంచి నిష్క్రమించిన పాక్ మహిళా జట్టుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంటికి వెళ్లడానికి కనీస సౌకర్యం కల్పించలేదు. బౌలర్ నష్రా సంధుకు లాహోర్ ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే సౌకర్యం కల్పించకపోవడంతో ఆమె చేసేది ఏమి లేక కుటుంబ సభ్యుని బైక్‌పై ఇంటికి వెళ్లింది. ఇది కాస్త సామా టీవీ చానెల్ ప్రసారం చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పాక్ క్రికెట్ అభిమానులంతా పీసీబీపై మండిపడుతుండగా భారత అభిమానులు మాత్రం ఎవరి చేసుకున్న కర్మ వారిదే అని కశ్మీర్ పరిస్థితి ఉద్ధేశించి కామెంట్లు చేస్తున్నారు. పాక్ పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మాతో క్రికెట్ ఆడటానికి మా దేశానికి రండి అని విజ్ఞప్తి చేసినా టాప్ ర్యాంకులో ఉన్న ఏ జట్లు పాక్‌లో ఆడటానికి సుముఖత చూపకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గడ్డు కాలాన్ని ఎదురుకుంటోంది. ఇక పాక్ మహిళా క్రికెటర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్ ఆదరణ పొందుతుండగా పాక్ మహిళల జట్టు మాత్రం ప్రపంచకప్‌లో దారుణంగా ఓటమిపాలైంది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్కటి గెలవకుండా టోర్ని నుంచి నిష్క్రమించింది. ఇక పీసీబీ నుంచి వీరికి ఎలాంటి ఆదరణ లేదు. ఘోర వైఫల్యాల కారణంగా పాక్ మహిళా జట్టు కెప్టెన్ సనామిర్పై వేటుపడింది. కెప్టెన్సీ నుంచి పీసీబీ ఆమెను తప్పించింది.


