Photo Credit: Twitter
మహిళల ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే పాక్ సెమీస్ బెర్తు కంటే పాక్ ప్లేయర్స్ ధరించి షూస్(Footwear)కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. నష్రా సంధు, ఐమన్ ఫాతిమా కోహ్లి వన్8 బ్రాండ్ షూతో కనిపించినప్పటికీ, జట్టులో దాదాపు అందరు ప్లేయర్లు ఇదే బ్రాండ్ షూను ధరించినట్లు తెలుస్తోంది.
పాక్ జట్టులో ప్రతీ మహిళా ప్లేయర్ ‘వన్8’ (one8) బ్రాండ్ షూనే ధరించారు. ఈ ‘వన్8’ ఫుట్‌వేర్ బ్రాండ్ మరెవరిదో కాదు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇదే ‘వన్8’ షూకు సహ యజమానిగా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేనప్పటికీ, పాక్ ఆటగాళ్లు తమ సొంత బ్రాండ్‌ను వదిలేసి టీమిండియా ఐకాన్ ప్లేయర్‌కు చెందిన బ్రాండ్‌తో అసోసియేట్ అవ్వడమే ఇక్కడ విశేషం.
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన అభిమానులు.. ‘‘పాక్ ఆటగాళ్లకు సొంత బ్రాండ్ అనేది లేదు. తాము ధరించే షూస్‌పై కూడా భారత్ బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ మన భారత్ బ్రాండ్.’’ అని కామెంట్లు చేయడం ఆసక్తి కలిగించింది.
కోహ్లీతో అనుబంధం దృష్ట్యా ‘వన్8’ కంపెనీ షూస్‌తో పాటు దుస్తులు, ఇతర క్రీడా ఉత్పత్తులను అందించే స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌గా విస్తరించింది. ఈ బ్రాండ్‌ను తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్న అగిలిటాస్, వన్8ను కోహ్లీతో కలిసి స్థాపించిన స్పోర్ట్స్‌వేర్ లేబుల్‌గా అభివర్ణిస్తుంది. అంతేకాదు కోహ్లి ‘వన్8’ పార్టనర్ ‘అగిలిటాస్’లో పెట్టుబడిదారుడు కూడా. కోహ్లి ఈ కంపెనీలో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.
సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్‌లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది.
అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది.
Many players of Pakistan women team was wearing @one8world shoes in asia cup match.
I have following questions
1. Products registered in india can't be exported to pak ,so did this deal happened in Dubai? Where matches are being played
2.Aisi kya majburi thi @one8world pic.twitter.com/GkVdg3BfUG— varun (@mystic_varunn) September 7, 2026
देखिए पाकिस्तानी महिला क्रिकेटर ईमान फातिमा विराट कोहली के One8 ब्रांड के जूते पहने हुए हैं। 👀
पाकिस्तानी खिलाड़ी भी वो अपने खुद के देश के ब्रांड्स से ज्यादा कोहली के ब्रांड पर भरोसा करती हैं।
कुछ फैंस कह रहे हैं कि उसने ये जूते स्मृति के किट बैग से चुराए हैं🤣 pic.twitter.com/n5zMtQicDR— Indian🇮🇳 (@singh31919) September 9, 2026
Read: ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్!


