వైభవ్ సూర్యవంశీకి షాక్ | Vaibhav Sooryavanshi IPL Teammate Surpasses Him In ICC T20I Rankings | Sakshi
Sakshi News home page

వైభవ్ సూర్యవంశీకి షాక్

Sep 9 2026 4:07 PM | Updated on Sep 9 2026 4:30 PM

Vaibhav Sooryavanshi IPL Teammate Surpasses Him In ICC T20I Rankings

source: BCCI X

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ​కి షాక్‌ తగిలింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అతడు రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో అతడి ఐపీఎల్‌ జట్టు (రాజస్థాన్‌ రాయల్స్‌) సహచరుడు, దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ ఏకంగా 61 స్థానాలు మెరుగుపర్చుకొని 44 స్థానానికి ఎగబాకాడు.

ఇటీవల ముగిసిన నమీబియా ట్రై-సిరీస్‌లో ప్రిటోరియస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 56.50 సగటుతో, 179.37 స్ట్రైక్‌రేట్‌తో 226 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ప్రిటోరియస్‌ మెరుపుల కారణంగా సౌతాఫ్రికా ట్రోఫీని కైవసం చేసుకుంది.

భారీ జంప్‌ కొట్టిన మరో సౌతాఫ్రికన్‌
ప్రిటోరియస్‌తో పాటు నమీబియా ట్రై సిరీస్‌లో చెలరేగిన మరో దక్షిణాఫ్రికా ఆటగాడు కానర్‌ ఎస్టర్‌హుయిజన్ కూడా ర్యాంకింగ్స్‌లో భారీ జంప్‌ కొట్టాడు. ఈ సిరీస్‌లో 126 పరుగులు చేసిన అతడు, ఏకంగా 65 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.

కాగా, టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ తన టీ20 టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పాక్‌ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్‌, టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కూడా తమ రెండు, మూడు స్థానాలను కాపాడుకున్నారు. మరో టీమిండియా ప్లేయర్‌ తిలక్‌ వర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలర్ల విభాగంలో రషీద్‌ ఖాన్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. భారత్‌ తరఫున వరుణ్‌ చక్రవర్తి అత్యుత్తమంగా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. 

చదవండి: 300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్‌ కిషన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement