Photo Credit: Twitter
టీమిండియా జట్టు అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రెండు నెలల పాటు టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆరేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుండడంతో ఇప్పటినుంచే టికెట్ల హడావిడి మొదలైంది. గత రెండు వారాల్లోనే 50వేల టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ పేరేంటింగ్ బాడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
మొదట క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై కస్టమర్లు, ఏఎన్‌జెడ్ కస్టమర్ల కోసం రెండు వారాల ప్రీ సేల్ విండో ఇచ్చారు. ఆగస్టు 24న క్రికెట్ నేషన్ ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. తర్వాత అభిమానుల కోసం కూడా టికెట్లను ఓపెన్ చేశారు.
ముందుగానే సభ్యత్వం తీసుకున్న వారికి 15 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. భారత్ సిరీస్ కోసం టికెట్లపై డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన బోర్డు, ఆగస్టులోనే అభిమానులను ప్రీ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. పబ్లిక్ టికెట్ సేల్స్ మొదలైన తర్వాత కూడా బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో అక్టోబర్ 24న జరిగే రెండో టీ20కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మైదానంలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. హాగ్లీ ఓవల్‌లో మ్యాచ్‌లకు ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ చెప్పారు.
కానీ ఒక మ్యాచ్‌కు ఇంత ముందుగానే మూడు వంతులకుపైగా టికెట్లు అమ్ముడవడం చాలా స్పెషల్ అని అన్నారు. సుమారు 9 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో నవంబర్ చివర్లో రెండో టెస్ట్ కూడా జరగనుంది.
Photo Credit: Twitter
రోహిత్, కోహ్లి క్రేజ్..
కివీస్ గడ్డపై టీమిండియాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, తమ అభిమాన క్రికెటర్లను చివరిసారి చూసుకోవాలని అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది.
🚨 50,000+ tickets already sold for New Zealand’s home summer of cricket 🇳🇿🏏
The India series is driving the madness Christchurch’s 2nd T20I is already 75% sold, while Eden Park has opened its 6th tier for the first time since India’s 2019 tour.
The demand for India in NZ is… pic.twitter.com/1i1xu2VHCp— Mid Wicket (@Thinkerr_11) September 9, 2026
Read: ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!


