సిక్కోలు కుర్రాడి మ్యాజిక్‌.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్‌ | Vaibhav Sooryavanshis Blunder Costs East Zone | Sakshi
Sakshi News home page

సిక్కోలు కుర్రాడి మ్యాజిక్‌.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్‌

Sep 9 2026 1:48 PM | Updated on Sep 9 2026 4:32 PM

Vaibhav Sooryavanshis Blunder Costs East Zone

PC: BCCI Domestic X

చెపాక్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్‌జోన్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. అందుకు బదులుగా తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌటైంది. 

తిలక్‌ వర్మ సెంచరీ మిస్‌
సౌత్‌జోన్ జట్టులో తిలక్ వర్మ (99), దేవదత్ పడిక్కల్ (62) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 300 మార్కును దాటగలిగింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్‌కు 300 పరుగులకు పైగా భారీ ఆధిక్యం లభించింది. అంతేకాకుండా సౌత్‌జోన్ ఫాలో-ఆన్ కూడా దాటలేకపోయింది. 

వైభవ్‌ విఫలం
అయినప్పటికీ ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సౌత్‌జోన్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా.. వారే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించేందుకు మైదానంలోకి దిగారు. అయితే ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ వికెట్లను కోల్పోయింది. 

సిక్కోలు కుర్రాడి దెబ్బ
మూడు పరుగులు చేసిన ఈశ్వరన్‌ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. యువ సంచలనం వైభవ్‌ను సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్ అవుట్ చేశాడు.

ఇన్నింగ్స్‌ ఆరువ ఓవర్‌లో విజయ్‌ తొలి బంతిని ఔట్‌సైడ్‌ ఆఫ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్‌.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి ఓవర్‌ కవర్స్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. 

కానీ బంతి ఎక్కువగా టర్న్‌ అయ్యి అతడి బ్యాట్‌ను దాటుకుంటూ వికెట్‌ కీపర్‌ జగదీశన్‌ చేతికి వెళ్లింది. వెంటనే జగదేశన్‌ స్టంప్స్‌ను గిరాటేశాడు. అప్పటికి క్రీజు బయట ఉండడంతో 8 పరుగులు చేసిన వైభవ్‌ స్టంపౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విజయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement