breaking news
Tripurana Vijay
-
వైభవ్‌ను అవుట్ చేసి లైమ్‌లైట్‌లోకి.. పట్టలేనంత ఆనందం!
సిక్కోలు క్రికెటర్ త్రిపురాన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టు వైపు అడుగులు వేస్తున్నాడు. టెక్కలికి చెందిన ఈ యువ ఆల్‌రౌండర్ తాజాగా భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్లీడే (టెస్టు)మ్యాచ్‌లలో పాల్గొనే భారత్–ఏ జట్టుకు ఎంపికైనట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న తన కలకు ఒకే ఒక్క అడు గు దూరంలో నిలిచాడు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీ స్ జట్టు భారత్‌కు వస్తున్న విషయం తెలిసిందే.బీసీసీఐ నుంచి పిలుపుకర్ణాటకకు చెందిన యువ పేసర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌కు గాయం కారణంగా దూరం కావడంతో అనూహ్యంగా ఆంధ్రాకు చెందిన ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. ఆసీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రాణించి భారత సెలక్షన్ కమిటీని ఆకట్టుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా కీర్తి గడించిన ఈ ఆఫ్ స్పిన్నర్ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా ఆకట్టుకుంటున్నాడు. వీటికితోడు బెస్ట్ ఫీల్డర్‌గా అనేక మ్యాచ్‌ల్లో రివార్డులు అందుకున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణింపుతో.. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రాణించడం ద్వారా సిక్కోలు యువతేజం విజయ్.. భారత–ఎ జట్టుకు ఎంపికయ్యాడు. వైభవ్‌ను అవుట్ చేసి లైమ్‌లైట్‌లోకి.. ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ వంటి ఇండియన్ టాప్‌క్లాస్ ప్లేయర్లను ఔట్ చేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. సౌత్‌జోన్‌కు ప్రధానమైన ఆఫ్ స్పిన్నర్‌గా సేవలు అందించాడు. ఇప్పటికే బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీఎల్‌కు 2025, 2026 రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జూలై నెలలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్ పురు షుల క్రికెట్ టోర్నీలో ఇండియా–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరిశాడు. భారత్–ఏ జట్టుకు విజయ్ ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు, ప్రతినిధులు, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు, విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు త్రిపురాన విజయ్ తండ్రి త్రిపురాన వెంకట కృష్ణరాజు సమాచార శాఖ ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. విజయ్ను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభినందించారు.పట్టలేనంత ఆనందంతో ఉన్నాను ఆసీస్‌తో జరిగే మల్టీ డే మ్యాచ్‌లో పాల్గొనే భారత–ఏ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్‌లో నన్ను చేర్చినట్టు వర్తమానం వచ్చిన ఆనందక్షణాలు మర్చిపోలేను. ఇటీవలి ఎమర్జింగ్ టోర్నీ, దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రాణింపుతో సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. – త్రిపురాన విజయ్, క్రికెటర్ -
IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు!
ఆస్ట్రేలియా- ‘ఎ’తో తలపడే భారత్- ‘ఎ’ జట్టులో ఒక మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. కర్ణాటక పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ గాయం వల్ల జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.పుదుచ్చేరి వేదికగాకాగా సెప్టెంబరు 22- అక్టోబరు 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ జట్టు భారత్‌కు వస్తోంది. ఇందుకు పుదుచ్చేరి వేదిక. ఈ క్రమంలో ఇప్పటికే ఆసీస్-‘ఎ’తో మల్టీ సిరీస్‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది.ఆసీస్‌తో అనధికారిక వన్డేలకు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది యాజమాన్యం. గాయం నుంచి కోలుకున్న అతడికి ఈ సిరీస్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఇక అనధికారిక వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనధికారిక టెస్టులకు దేవదత్ పడిక్కల్ సారథ్యం వహిస్తాడు.గాయం వల్ల దూరం!ఇక విజయ్ కుమార్ వైశాఖ్‌కు అనధికారిక టెస్టు జట్టులో చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడు ఆడతాడని జట్టు ప్రకటన సమయంలోనే యాజమాన్యం పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. విజయ్ కుమార్ వైశాఖ్ తొడకండరాల గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆసీస్‌తో మల్డీ డే మ్యాచ్‌లకు వైశాఖ్ దూరం కాగా.. ఆంధ్ర రైటార్మ్ స్పిన్నర్, సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్‌కు భారత్-‘ఎ’ జట్టులో చోటు దక్కినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.దులిప్‌ట్రోఫీలో సత్తా చాటికాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన విజయ్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇటీవల ఈస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో భాగంగా సౌత్ జోన్‌కు ఆడిన ఈ స్పిన్ బౌలర అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన పాతికేళ్ల విజయ్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బంతితో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సంపాదించిన ఈస్ట్ జోన్ నిబంధనల ప్రకారం టైటిల్‌ను కైవసం చేసుకుంది.చదవండి: సంజూను పక్కన పెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్Vijaykumar Vyshak has been ruled out of India A’s two four-day matches against Australia A due to injury.Andhra off-spinner Tripurana Vijay has been named as his replacement.— Pratyush Raj (@pratyush93_raj) September 18, 2026 -
ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్‌జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్‌ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్‌జోన్, ఆ తర్వాత సౌత్‌జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
చెపాక్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్‌జోన్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. అందుకు బదులుగా తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ సెంచరీ మిస్సౌత్జోన్ జట్టులో తిలక్ వర్మ (99), దేవదత్ పడిక్కల్ (62) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 300 మార్కును దాటగలిగింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్‌కు 300 పరుగులకు పైగా భారీ ఆధిక్యం లభించింది. అంతేకాకుండా సౌత్‌జోన్ ఫాలో-ఆన్ కూడా దాటలేకపోయింది. వైభవ్ విఫలంఅయినప్పటికీ ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సౌత్‌జోన్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా.. వారే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించేందుకు మైదానంలోకి దిగారు. అయితే ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ వికెట్లను కోల్పోయింది. సిక్కోలు కుర్రాడి దెబ్బమూడు పరుగులు చేసిన ఈశ్వరన్‌ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. యువ సంచలనం వైభవ్‌ను సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్ అవుట్ చేశాడు.ఇన్నింగ్స్ ఆరువ ఓవర్లో విజయ్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి ఓవర్ కవర్స్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి అతడి బ్యాట్‌ను దాటుకుంటూ వికెట్ కీపర్ జగదీశన్ చేతికి వెళ్లింది. వెంటనే జగదేశన్ స్టంప్స్‌ను గిరాటేశాడు. అప్పటికి క్రీజు బయట ఉండడంతో 8 పరుగులు చేసిన వైభవ్ స్టంపౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విజయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా? -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. An innings of pure class 👌Watch 🎥 snippets of Ishan Kishan's fantastic double century so far 💯💯Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మొదలైంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ సూపర్ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ డబుల్ సెంచరీసౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్.. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. శతక్కొట్టిన కుశాగ్రాట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్ బౌలింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్ రాయ్ (45), ఎండీ కొనియన్ ఖురేషి (40) రాణించారు. టెయిలెండర్లలో మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్ జోన్ తరఫున 2014లో నార్త్ జోన్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్ 270 పరుగులు సాధించి నమన్ ఓజాను అధిగమించాడు.చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్ కెప్టెన్! -
నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు శ్రీకాకుళం కుర్రాడి ఐపీఎల్ అరంగేట్రం
ఐపీఎల్లో అరంగేట్రంలో చేసేందుకు గతేడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న శ్రీకాకుళం కుర్రాడు, ఆంధ్ర స్టార్ స్పిన్నర్ త్రిపురాన విజయ్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విజయ్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో విజయ్ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది. కానీ గత సీజన్లో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమైనా ఏ మాత్రం నిరాశ చెందుకుండా నిత్యం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. స్పీడ్ స్టార్ అకిబ్ నబీ స్ధానంలో విజయ్ను తుది జట్టులోకి ఢిల్లీ తీసుకుంది. విజయ్‌కు రైట్- ఆర్మ్ ఆఫ్‌బ్రేక్‌తో పాటు బ్యాట్‌తో రాణించే సత్తా ఉంది.ఎవరీ విజయ్?24 ఏళ్ల త్రిపురాన విజయ్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొదటి క్రికెటర్‌గా ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. అండర్–19లో ఏసీఏ నార్త్‌జోన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆంధ్ర సీనియర్ జట్టు నుంచి 2021లో విజయ్‌కు తొలిసారి పిలుపు వచ్చింది. లిస్ట్-ఎ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్‌పై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడాదికే విజయ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. రెడ్ బాల్ క్రికెట్లో విజయ్ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. విజయ్ ఇప్పటివరకు 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడు లిస్ట్-ఎలో 5, టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తన మార్క్ చూపించేందుకు విజయ్ సిద్దమయ్యాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు


