IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు! | IND A vs AUS A Tripurana Vijay To Replace Vijaykumar Vyshak: Report | Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు!?

Sep 18 2026 1:32 PM | Updated on Sep 18 2026 1:55 PM

IND A vs AUS A Tripurana Vijay To Replace Vijaykumar Vyshak: Report

PC: Instagram

ఆస్ట్రేలియా- ‘ఎ’తో తలపడే భారత్‌- ‘ఎ’ జట్టులో ఒక మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. కర్ణాటక పేసర్‌ విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ గాయం వల్ల జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.

పుదుచ్చేరి వేదికగా
కాగా సెప్టెంబరు 22- అక్టోబరు 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్‌ జట్టు భారత్‌కు వస్తోంది. ఇందుకు పుదుచ్చేరి వేదిక. ఈ క్రమంలో ఇప్పటికే ఆసీస్‌-‘ఎ’తో మల్టీ సిరీస్‌లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది.

ఆసీస్‌తో అనధికారిక వన్డేలకు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసింది యాజమాన్యం. గాయం నుంచి కోలుకున్న అతడికి ఈ సిరీస్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఇక అనధికారిక వన్డేలకు రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనధికారిక టెస్టులకు దేవదత్‌ పడిక్కల్‌ సారథ్యం వహిస్తాడు.

గాయం వల్ల దూరం!
ఇక విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌కు అనధికారిక టెస్టు జట్టులో చోటు దక్కింది. అయితే, ఫిట్‌నెస్‌ ఆధారంగానే అతడు ఆడతాడని జట్టు ప్రకటన సమయంలోనే యాజమాన్యం పేర్కొంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ తొడకండరాల గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆసీస్‌తో మల్డీ డే మ్యాచ్‌లకు వైశాఖ్‌ దూరం కాగా.. ఆంధ్ర రైటార్మ్‌ స్పిన్నర్‌, సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్‌కు భారత్‌-‘ఎ’ జట్టులో చోటు దక్కినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దులిప్‌ట్రోఫీలో సత్తా చాటి
కాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన విజయ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఇటీవల ఈస్ట్‌ జోన్‌తో దులిప్‌ ట్రోఫీ-2026 ఫైనల్లో భాగంగా సౌత్‌ జోన్‌కు ఆడిన ఈ స్పిన్‌ బౌలర​ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన పాతికేళ్ల విజయ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బంతితో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని అవుట్‌ చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌ డ్రా అయినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సంపాదించిన ఈస్ట్‌ జోన్‌ నిబంధనల ప్రకారం టైటిల్‌ను కైవసం చేసుకుంది.

చదవండి: సంజూను పక్కన పెట్టాను.. వైభవ్‌ వేచి చూడాల్సిందే: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement