IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్‌ పాండ్యాకు చోటు | India A Squads For Australia Series Announced Hardik Pandya Included | Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్‌ పాండ్యాకు చోటు

Sep 9 2026 4:09 PM | Updated on Sep 9 2026 4:53 PM

India A Squads For Australia Series Announced Hardik Pandya Included

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI X)

ఆస్ట్రేలియా-‘ఎ’తో సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్‌ పడిక్కల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ.. వన్డే జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తాడని తెలిపింది.

హార్దిక్‌ పాండ్యాకు చోటు
ఇక ఆసీస్‌-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలలో తలపడే భారత-‘ఎ’ జట్టులో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు కూడా చోటు దక్కడం విశేషం. అయితే, ఫిట్‌నెస్‌ ఆధారంగా అతడు జట్టులోకి వస్తాడని బోర్డు వెల్లడించింది. 

గాయాల బెడద
కాగా హార్దిక్‌ పాండ్యా వివిధ గాయాల కారణంగా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌-‘ఎ’తో వన్డే సిరీస్‌ సందర్భంగా అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్‌లకు పుదుచ్చేరి వేదిక. 

ఆస్ట్రేలియా- ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టు
అమన్‌ మోఖడే, ఆయుశ్‌ పాండే, దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌ (వైస్‌ కెప్టెన్‌), యశ్‌ రాథోడ్‌, షేక్‌ రషీద్‌, కుమార్‌ కుశాగ్ర (వికెట్‌ కీపర్‌), షామ్స్‌ ములాని, తనుష్‌ కొటియాన్‌, తుషార్‌ దేశ్‌పాండే, అన్షుల్‌ కాంబోజ్‌, ప్రఫుల్‌ హింగే, నారాయణన్‌ జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), నచికేత్‌ భూటే, వి వైశాక్‌* (ఫిట్‌నెస్‌ ఆధారంగా).

ఆసీస్‌-‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టు
ప్రియాన్ష్‌ ఆర్య, సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, కుమార్‌ కుశాగ్ర (వికెట్‌ కీపర్‌), నిశాంత్‌ సింధు, విప్రాజ్‌ నిగమ్‌, అర్షిన్‌ కులకర్ణి, అర్షద్‌ ఖాన్‌, నమన్‌ ధిర్‌, హార్దిక్‌ పాండ్యా (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), గుర్జప్రీత్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌.

భారత్‌-‘ఎ’ వర్సెస్‌ ఆసీస్‌-‘ఎ’ సిరీస్‌ షెడ్యూల్‌
అనధికారిక టెస్టు సిరీస్‌
👉సెప్టెంబరు 22-25: తొలి మల్టీ డే మ్యాచ్‌- పుదుచ్చేరి
👉సెప్టెంబరు 29- అక్టోబరు 2: రెండో మల్టీ డే మ్యాచ్‌- పుదుచ్చేరి

అనధికారిక వన్డే సిరీస్‌
👉అక్టోబరు 6: తొలి వన్డే- పుదుచ్చేరి
👉అక్టోబరు 9: రెండో వన్డే- పుదుచ్చేరి
👉అక్టోబరు 11: మూడో వన్డే- పుదుచ్చేరి.

చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్‌.. వైభవ్‌ సూర్యవంశీ మైండ్‌బ్లాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement