PC: Star Sports X
టీమిండియా క్రికెటర్లకు సంబంధించి చాట్ జీపీటీ ద్వారా చేసిన పాత ఫోటోల ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన ప్రస్తుతం క్రికెటర్లు 80వ దశకంలో ఇలా ఉండేవారంటూ పెట్టిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇందులో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, టీ20 స్పెషలిస్టు సంజు శాంసన్, టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర వీరుడు అభిషేక్ శర్మ చాట్ జీపీటీ ఫోటోల ద్వారా నాటి ట్రెండ్‌ను గుర్తుకు తెచ్చారు!

PC: Star Sports X
వీరిని గుర్తుపట్టడం కష్టమే!
స్టార్ స్పోర్ట్స్ కన్నడ ధోనితో సంజూ.. గిల్, హార్దిక్ పాండ్యాలతో శ్రేయస్ అయ్యర్.. అభిషేక్ శర్మతో వైభవ్ సూర్యవంశీ కలిసి ఉన్న ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. ఇందులో సంజూ, శ్రేయస్ అయ్యర్‌ను తప్ప మిగతా వారందరినీ సులువుగానే గుర్తుపట్టొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

PC: Star Sports X
ముందు స్వదేశంలో.. ఆ తర్వాత జపాన్‌లో
ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గాన్ మధ్య సెప్టెంబరు 13,15, 17 తేదీల్లో ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇక్కడ అఫ్గాన్ బోర్డు టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఇక ఈ సిరీస్ తర్వాత వీరంతా ఆసియా క్రీడలు-2026 టోర్నీతో బిజీ కానున్నారు.
మరోవైపు.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. ఫలితంగా అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. కాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత టీ20 జట్టు జపాన్‌లో ఆసియా క్రీడల్లో పాల్గొనే సమయంలో.. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది.


