ఏషియన్‌ గేమ్స్‌.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన! | BCCI Breaks Silence On Team Indias Asian Games Accommodation Controversy, Players To Stay In Organisers Hotels | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన!

Sep 9 2026 9:10 AM | Updated on Sep 9 2026 11:46 AM

BCCI Breaks Silence On Team Indias Asian Games Accommodation Controversy

ఆసియా క్రీడల్లో ఆటగాళ్లకు కల్పించే వసతి సౌకర్యాలు బాగా లేవని, భారత క్రికెటర్లు అలాంటి చోట ఉండటానికి ఇష్టపడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రీడల నిర్వాహక కమిటీ అవసరమైతే ప్లేయర్లు తమకు నచి్చన హోటళ్లలో ఉండవచ్చంటూ వెసులుబాటు కూడా కల్పించింది.

అయితే ఈ అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు స్పష్టతనిచ్చింది. టీమిండియా ఆటగాళ్లు నిర్వాహకులు కలి్పంచిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. జపాన్‌లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. 

"విదేశీ పర్యటనల్లో మనకు లభించే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ సౌకర్యాలు ఇప్పుడు ఉండకపోవచ్చనేది వాస్తవం. అయితే నిర్వాహకులు ఎలాంటి వసతి కల్పించినా మన ఆటగాళ్లు అక్కడే ఉంటారు. అద్భుతంగా కాకపోయినా అవి సౌకర్యంగానే ఉంటాయని నమ్ముతున్నాం. నగోయాలో ఉండే వసతి, వారు ఎంచుకున్న చిన్న తరహా హోటల్‌ గదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూశాం. 

అవి బాగానే ఉన్నాయి. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు వాటినే వాడుకుంటారు. ఇక్కడ మేం ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నా ఎలాంటి పెద్ద హోటల్స్‌ లేవు. ఈవెంట్‌కు చాలా దూరంలో ఉండే ఒసాకా లేదా టోక్యోలలో బస చేయడానికి అవకాశం లేదు" అని శుక్లా పేర్కొన్నారు. అయితే వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్‌ రూమ్‌వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు. 
చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement