breaking news
India A vs Australia A
-
ఊహకైనా అందడం లేదు: శ్రేయస్ అయ్యర్‌పై మాజీ చీఫ్ సెలక్టర్ ఫైర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తీరుపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. శ్రేయస్ చెప్పే సాకులు తన ఊహకు కూడా అందడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత ఐపీఎల్-2025 (IPL)లోనూ సత్తా చాటాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు దేశీ క్రికెట్లోనూ రాణించాడు.కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు...అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup 2025) జట్టుకు సెలక్టర్లు శ్రేయస్‌ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియా-‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌కు అతడిని భారత్-‘ఎ’ కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. ఈ క్రమంలో తొలి టెస్టు ఆడి విఫలమైన శ్రేయస్.. రెండో టెస్టు ఆరంభానికి ముందే కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు జట్టు నుంచీ తప్పుకొన్నాడు.ఆరు నెలల విరామంవెన్నునొప్పి కారణాంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయలేకపోతున్నానంటూ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఆరు నెలలపాటు రెడ్‌బాల్ క్రికెట్‌కు విరామం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ఈ విషయాన్ని ధ్రువీకరించిన బోర్డు.. ఆసీస్-ఎ జట్టుతో వన్డేలకు అతడిని సారథిగా నియమించింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా శ్రేయస్‌ను ఎంపిక చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ శ్రేయస్ అయ్యర్ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘నిజం చెప్పాలంటే.. శ్రేయస్ అయ్యర్ చేసిన పని నన్ను సందిగ్దంలోకి నెట్టేసింది.ఊహకు కూడా అందడం లేదురెడ్బాల్ క్రికెట్‌కు తాను అన్‌ఫిట్ అని శ్రేయస్ స్వయంగా చెప్పాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్ ఆడేందుకు మాత్రం ఫిట్‌గా ఉన్నానన్నాడు. రెడ్‌బాల్, వైట్‌బాల్ క్రికెట్ల మధ్య అంతరం ఏమిటో నాకైతే అర్థంకావడం లేదు.ఒకవేళ ఒక ఆటగాడు వైట్‌బాల్ క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడంటే.. రెడ్‌బాల్ క్రికెట్‌కు కూడా సిద్ధంగా ఉండాలి కదా!.. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. నా ఊహకు కూడా అందడం లేదు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా -
‘వైభవ్ సూర్యవంశీ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడు’
భారత క్రికెట్లో కొన్నాళ్లుగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు మారుమ్రోగిపోతోంది. పన్నెండేళ్ల వయసులోనే రంజీల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్లకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ అడుగుపెట్టాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.ఫాస్టెస్ట్ సెంచరీలుఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాది వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ జుబిన్ బరూచా (Zubin Barucha) వైభవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వైభవ్ సూర్యవంశీ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడు‘‘వీలైనంత త్వరగా అతడిని సీనియర్ జట్టు (టీమిండియా)లోకి పంపించాలి. చాలా ఏళ్ల క్రితం సచిన్ టెండుల్కర్ (16 ఏళ్ల వయసులో అరంగేట్రం) విషయంలో ఇలాగే చేశారు. ఇప్పుడు వైభవ్ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.కనీసం ఇండియా-‘ఎ’ తరఫునైనా అతడిని ఆడించాలి. తక్షణమే ఆ జట్టులోకి వైభవ్‌ను పంపించండి. ఇటీవల అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ బౌలర్ల బౌలింగ్ చూస్తే.. వైభవ్ గనుక జట్టులో ఉండి ఉంటే డబుల్ సెంచరీ బాదేవాడని అనిపించింది.జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడానికి స్టీవ్ స్మిత్ వంటి మేటి బ్యాటర్లే భయపడతారు. మా జట్టు తరఫున నెట్స్‌లో బరిలోకి దిగినా ఆర్చర్ ప్రధాన మ్యాచ్‌లో మాదిరే బౌల్ చేస్తాడు. అలా ఓసారి ప్రాక్టీస్ సెషన్లో ఆర్చర్ బౌలింగ్‌లో స్మిత్ తలకు గాయమైంది.ఆరోజు వైభవ్ అద్భుతం చేశాడుఅప్పటి నుంచి ఆర్చర్ నెట్స్‌లో ఉంటే స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చేవాడే కాదు. అందుకే ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ బ్యాటింగ్ చేయబోతున్నపుడు నేను భయపడ్డాను. కానీ.. ఆ పిల్లాడు బ్యాక్‌ఫుట్ షాట్ ఆడి.. బంతిని స్టేడియం అవతలకు తరలించాడు. నాతో పాటు కోచింగ్ స్టాఫ్.. ఆఖరికి ఆర్చర్ కూడా ఆశ్చర్యపోయాడు’’ అని జుబిన్ బరూచా చెప్పుకొచ్చాడు. వైభవ్‌ను త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని చీఫ్ సెల క్టర్ అజిత్ అగార్కర్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు.కాగా సొంతగడ్డపై ఇండియా-‘ఎ’ జట్టు ఇటీవల ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను 1-0తో భారత్ సొంతం చేసుకుంది. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
ప్రభ్‌సిమ్రన్ విధ్వంసకర శతకం.. ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై టీమిండియా గెలుపు
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (India A vs Australia A) భారత-ఏ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 5) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్‌పై (Australia) భారత్ (Team India) 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఆసీస్ గెలిచింది. దీనికి ముందు ఆసీస్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా భారత్ చేజిక్కించుకుంది (1-0).భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్‌సిమ్రన్ సింగ్ విధ్వంసకర శతకంఅనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ప్రభ్‌సిమ్రన్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62) తీర్చిదిద్దారు.ఆఖర్లో ఉత్కంఠగా మారిన మ్యాచ్అయితే ఆఖర్లో భారత ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒక్కో పరుగు చేసేందుకు భారత ఆటగాళ్లు నానా కష్టాలు పడ్డారు. అయితే చివర్లో విప్రాజ్ నిగమ్ (24 నాటౌట్), అర్షదీప్ (7 నాటౌట్) సహకారంతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆసీస్ బౌలర్లు టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘా తలో 4 వికెట్లు తీసి భారత్‌ను భయపెట్టారు.చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
ఆసీస్ భారీ స్కోర్.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల (India A vs Australia A) మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 5) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్‌సిమ్రన్ విశ్వరూపంఅనంతరం 317 భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ (Team India).. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన శైలికి విరుద్దంగా నిదానంగా ఆడి 25 బంతుల్లో కేవలం రెండే ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. గత వన్డేలో సత్తా చాటిన తిలక్ వర్మ (3) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (17), రియాన్ పరాగ్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 26 ఓవర్లలో మరో 145 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా -
భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
కాన్పూర్ వేదికగా భారత్-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (5) వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపరిచాడు.ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్ సింగ్ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌కు (6-0-60-0) ఆసీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు టాస్ గందరగోళం -
IND vs AUS: ప్చ్... తిలక్ వర్మ మెరిసినా...
ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత ‘ఎ’ (IND A vs AUS A) జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని భారత ‘ఎ’జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. 246 పరుగులకు ఆలౌట్కాన్పూర్ వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. ఇటీవల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అజేయ అర్ధశతంతో మెరిసి జట్టును గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma) మరోసారి ఆకట్టుకున్నాడు. త్రుటిలో చేజారిన శతకంతాజా మ్యాచ్‌లో తిలక్ 122 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసి త్రుటిలో శతకం కోల్పోయాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న తిలక్ వర్మ... ఇప్పుడు వన్డే ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. రియాన్ పరాగ్ (54 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. రియాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు తిలక్ 101 పరుగులు జతచేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ బ్యాటర్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలంఇక తొలి మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (1), శ్రేయస్ అయ్యర్ (8)తో పాటు... అభిషేక్ శర్మ (0), నిశాంత్ (1) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా లక్ష్యఛేదన ప్రారంభించాక భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా... ఆసీస్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 160గా నిర్ణయించారు. సిరీస్ సమంఛేదనలో ఆసీస్ 16.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. మెకంజీ హార్వే (49 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో నిషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా పేసర్ అర్శ్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరగనుంది.చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ -
ఆసీస్‌పై విధ్వంసకర శతకం బాదిన ప్రియాంశ్ ఆర్య.. తొలి మ్యాచ్‌లోనే..!
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో (India A vs Australia A) భారత-ఏ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) చెలరేగిపోయాడు. 82 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్య మరో ఓపెనర్, పంజాబ్ కింగ్స్ సహచరుడు ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో (53 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 123 బంతుల్లో 135 పరుగులు జోడించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 31.4 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 214/2గా ఉంది. ఆర్య, ప్రభ్‌సిమ్రన్ ఔట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36), రియాన్ పరాగ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ నిన్న జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఇవాల్టికి వాయిదా పడింది.టీమిండియా దిశగా అడుగులు..ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మెరుపు శతకాలు బాది, ఐపీఎల్ ఛాన్స్ దక్కించుకున్న ప్రియాంశ్.. తన తొలి ఐపీఎల్ ఎడిషన్‌లోనే (2025) చెలరేగిపోయాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసి సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్లో ప్రియాంశ్ సీఎస్కేపై 42 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రకంపనలు సృష్టించాడు. గత సీజన్లో ప్రియాంశ్ మొత్తంగా 475 పరుగులు సాధించి, ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్-ఏపై సెంచరీతో ప్రియాంశ్ అడుగులు టీమిండియావైపు పడుతున్నాయనడంలో సందేహం లేదు.తొలి మ్యాచ్‌లోనే..!ప్రియాంశ్ భారత్-ఏ తరఫున ఆడటం ఇదే తొలిసారి. ఆసీస్-ఏతో సిరీస్‌కు అతను కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో జరుగబోయే మిగతా రెండు వన్డేలకు ప్రియాంశ్ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేస్తాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో చేజిక్కించుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ నడుస్తుంది. మిగతా రెండు వన్డేలు అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు -
IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కేఎల్ రాహుల్ (KL Rahul) భారీ శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. సాయి సుదర్శన్ (Sai Sudharsan) సెంచరీతో అలరించాడు. ఇక కెప్టెన్ ధ్రువ్ జురెల్ సైతం అద్భుత అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు.భారత్- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డే సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా టీమ్ ఇక్కడకు వచ్చింది. ఇందులో భాగంగా లక్నోలో తొలుత టెస్టులు జరుగగా.. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది.ఫలితం తేలిందిఈ క్రమంలో మంగళవారం మొదలైన రెండో అనధికారిక టెస్టులో మాత్రం.. ఆఖరి రోజైన శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), టాడ్ మర్ఫీ (76) అర్ధ శతకాలతో రాణించగా.. 97.2 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నుర్ బ్రార్ మూడు, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిరాశపరిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్ (1), కెప్టెన్ ధ్రువ్ జురెల్ (1), నితీశ్ కుమార్ రెడ్డి (1) పూర్తిగా విఫలమయ్యారు.ఆసీస్‌కు 226 పరుగుల భారీ ఆధిక్యంఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 75 పరుగులతో సత్తా చాటాడు. ఆయుశ్ బదోని 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 194 పరుగులు చేసి భారత్ ఆలౌట్ కాగా.. ఆసీస్‌కు 226 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఈసారి 185 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (85 నాటౌట్), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (50) వల్లే ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ మరోసారి ఆకట్టుకున్నారు. వీరిద్దరు చెరో మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ భారత్ ముందు 412 పరుగుల (226+185) భారీ లక్ష్యం ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది భారత్.రాహుల్, సాయి శతకాలు.. టార్గెట్ పూర్తి చేసిన భారత్అయితే, 74 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక 169/2 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ నాలుగో రోజు ఆట మొదలుపెట్టగా.. రాహుల్ తిరిగి బ్యాట్ పట్టి మైదానంలో దిగాడు. మొత్తంగా 210 బంతులు ఎదుర్కొని 176 పరుగులతో అజేయంగా నిలిచాడు.మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (100) కూడా శతకం సాధించాడు. అయితే, నైట్ వాచ్‌మన్ మానవ్ సుతార్ (5) వచ్చీ రాగానే వెళ్లిపోగానే.. దేవ్‌దత్ పడిక్కల్ (5) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో రాహుల్‌కు తోడైన కెప్టెన్ జురెల్ 66 బంతుల్లో 56 పరుగులతో సత్తా చాటాడు. ఇక నితీశ్ కుమార్ రెడ్డి 16 పరుగులతో అజేయంగా నిలిచి రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.భారత్-‘ఎ’ వర్సెస్ ఆస్ట్రేలియా- ‘ఎ’ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లువేదిక: ఏకనా స్టేడియం, లక్నోటాస్: భారత్.. తొలుత బౌలింగ్ఆస్ట్రేలియా-ఎ: 420 & 185భారత్-ఎ: 194 & 413/5ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీన్‌ను ఓడించిన భారత్.చదవండి: అందుకే షమీని సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
IND vs AUS: వారెవ్వా.. సెంచరీతో అదరగొట్టిన సాయి సుదర్శన్
టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు (IND A vs AUS A)తో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్-‘ఎ’ తరఫున ఈ వన్‌డౌన్ బ్యాటర్ అదరగొట్టాడు. రెండు అర్ధ శతకాలు బాదడంతో పాటు.. సెంచరీతోనూ సత్తా చాటాడు.సెంచరీతో అదరగొట్టిన సాయి సుదర్శన్లక్నోలోని ఏకనా స్టేడియంలో తొలి అనధికారిక టెస్టులో సాయి సుదర్శన్ 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, కూపర్ కన్నోలి బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది.ఇక అదే వేదికపై ఆసీస్-‘ఎ’తో రెండో అనధికారిక టెస్టులోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 140 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 75 పరుగులు చేశాడు. అయితే, ఈసారి కూడా అతడు లెగ్ బిఫోర్‌గా వెనుదిరగడం గమనార్హం. టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆటలో సాయి సుదర్శన్ 172 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 100 పరుగులు సాధించాడు. అయితే, ఆ వెంటనే క్యారీ రొచిసిల్లి బౌలింగ్‌లో కాంప్‌బెల్ కెల్లావేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆస్ట్రేలియా- ‘ఎ’ సిరీస్‌లో మొత్తంగా 248 పరుగులు సాధించాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు సాయి సుదర్శన్ ఇలా సత్తా చాటడం ద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో మూడోస్థానంలో తన స్థానం సుస్థిరం చేసుకునే క్రమంలో కీలక ముందడుగు వేశాడు.అతడికి మరిన్ని అవకాశాలిస్తామన్న అగార్కర్కాగా టెస్టుల్లో వన్‌డౌన్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ పాతుకుపోయేట్లుగానే కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘టెస్టుల్లో మూడో స్థానంలో సాయి సుదర్శన్ చక్కటి భరోసా కల్పించాడు. అతడికి మరిన్ని అవకాశాలిస్తాం’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు.తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ 23 ఏళ్ల సాయి సుదర్శన్ 2023లో వన్డేల్లో, 2024లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇటీవలే అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 140 పరుగులు సాధించాడు.రాహుల్, సాయి శతకాలతో..ఇక భారత్- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ మ్యాచ్ విషయానికొస్తే.. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ (100) శతకాల కారణంగా విజయం దిశగా సాగుతోంది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఈ క్రమంలో శుక్రవారం 79 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి.. విజయానికి 95 పరుగుల దూరంలో ఉంది. రాహుల్ 131, కెప్టెన్ ధ్రువ్ జురెల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: IND Vs PAK: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. అతడొక అద్భుతం.. మా ఫీల్డింగ్ సూపర్: పాక్ కెప్టెన్ -
IND vs AUS: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుత శతకంతో మెరిశాడు. భారత్- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ (IND A vs AUS A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా.. భోజన విరామ సమయానికి 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. జట్టును విజయం దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా భారత్-‘ఎ’ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. లక్నోలో మంగళవారం మొదలైన ఈ నాలుగు రోజుల టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.భారత్ లక్ష్యం 412ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్- ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత 194 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. ఈసారి మాత్రం భారత బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది.46.5 ఓవర్లలో 185 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ లక్ష్యం 412 (226+185) పరుగులుగా మారింది. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 41 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రాహుల్ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు జతైన దేవ్‌దత్ పడిక్కల్ (5) పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన స్పిన్నర్ మానవ్ సుతార్.. శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వెనుదిరిగాడు.తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి శతకం పూర్తిఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. 143 బంతుల్లో పన్నెండు ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. 44 పరుగులతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన సాయి సుదర్శన్ (98 బ్యాటింగ్) కూడా శతకానికి చేరువయ్యాడు. దీంతో భోజన విరామ సమయానికి భారత్ 66 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 151 పరుగులు అవసరం కాగా.. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇక ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో అక్టోబరులో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్‌తో పాటు.. సాయి సుదర్శన్ ఎంపికైన విషయం తెలిసిందే.అప్డేట్: లంచ్ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్ ఆ వెంటనే అవుటయ్యాడు. చదవండి: IND vs WI: కరుణ్ నాయర్‌పై వేటు -
IND vs AUS: విజయానికి 243 పరుగుల దూరంలో..
లక్నో: భారత్- ఆస్ట్రేలియా ‘ఎ’ (IND A vs AUS A)జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు రసవత్తర ముగింపునకు చేరింది. మూడో రోజు ఆటలో ప్రత్యర్థిని 190 పరుగుల్లోపే ఆలౌట్ చేసిన భారత్ ‘ఎ’ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 243 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లున్నాయి. మూడో రోజు ఆటలో ఇరుజట్లవి కలిపి 9 వికెట్లు కూలాయి. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 16/3తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 46.5 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌటైంది.ఓవర్‌నైట్ బ్యాటర్, కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (249 బంతుల్లో 85; 10 ఫోర్లు, 1 సిక్స్) సహచరులు వెనుదిరుగుతున్నా... చక్కని పోరాటం చేశాడు. ఆరంభంలోనే హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ (Mohammed Siraj) పేస్‌కు 17 పరుగుల వద్ద కూపర్ కానొలి (1) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జోష్ ఫిలిప్ (48 బంతుల్లో 50; 8 ఫోర్లు)తో కలిసి మెక్‌స్వీని ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వంద దాటింది.ఈ దశలో సీమర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుథార్ (Manav Suthar) కంగారూ ఇన్నింగ్స్‌ను కోలుకోని విధంగా దెబ్బకొట్టారు. దీంతో 78 పరుగుల వ్యవధిలో 6 వికెట్లను కోల్పోయి 200 పరుగుల్లోపే ఆలౌటైంది. గుర్నూర్, మానవ్ చెరో 3 వికెట్లు తీయగా... సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. రాహుల్ 74 రిటైర్డ్‌హర్ట్ అనంతరం 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ ‘ఎ’కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (KL Rahul- 92 బంతుల్లో 74; 9 ఫోర్లు), జగదీశన్ (36; 5 ఫోర్లు) శుభారంభమిచ్చారు. 17 ఓవర్లలో 85 పరుగులు జోడించారు. 18వ ఓవర్ తొలి బంతికే జగదీశన్ అవుటవడంతో ఈ భాగస్వామ్యం చెదిరింది.తర్వాత కూడా టీమిండియా సీనియర్ బ్యాటర్ అయిన రాహుల్... వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (84 బంతుల్లో 44 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మరో భాగస్వామ్యానికి తెరలేపాడు. కానీ అర్ధసెంచరీ అనంతరం రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత దేవదత్ పడిక్కల్ (5) నిరాశపరచగా, మానవ్ సుతార్ (1 బ్యాటింగ్) సుదర్శన్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. టాడ్ మర్ఫీ 2 వికెట్లు తీశాడు. తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... ఈ మ్యాచ్ గెలిచిన జట్టే సిరీస్‌ను దక్కించుకుంటుంది. సంక్షిప్త స్కోర్లు 👉ఆస్ట్రేలియా ‘ఎ’ తొలిఇన్నింగ్స్: 420👉భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 194👉ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 185 (మెక్‌స్వీని 85; గుర్నూర్ బ్రార్ 3/42, సిరాజ్ 2/20). 👉భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 169/2 (కేఎల్ రాహుల్ రిటైర్డ్‌హర్ట్ 74, సాయిసుదర్శన్ 44). చదవండి: Asia Cup 2025: భారత్ ప్రత్యర్థి పాక్ -
IND VS AUS: కేఎల్ రాహుల్‌కు గాయం.. సెంచరీ దిశగా సాగుతుండగా..!
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో (India A vs Australia A) జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు. 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.బ్యాటింగ్ చేస్తుండగా అసౌకర్యానికి గురైన రాహుల్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దేవ్‌దత్ పడిక్కల్ (8 బంతుల్లో 5) ఇలా వచ్చి అలా ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (44), మానవ్ సుతార్ (1) ఛేదనను కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఓపెనర్ ఎన్ జగదీసన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 169/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 243 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఛేదనకు భారత్‌కు రేపు కూడా అవకాశం ఉంది.దీనికి ముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ తలో 3.. సిరాజ్, యశ్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆ జట్టు తరఫున కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (85 నాటౌట్), ఫిలిప్ (50) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రాహుల్ (11), జగదీసన్ (38), ఆయుశ్ బదోని (21), ప్రసిద్ద్ కృష్ణ (16 రిటైర్డ్ హర్ట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో థార్న్టన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్‌ల్యాండ్, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్ బ్రార్ 3, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి కాగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరో బంపరాఫర్ వచ్చింది. ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం ప్రకటించింది. అదే విధంగా.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది.కాగా గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో బీసీసీఐ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో స్వదేశంలో అనధికారిక టెస్టు సిరీస్‌కు భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ను ఎంపిక చేసింది.కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు..ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి అనధికారిక టెస్టు ఆడిన శ్రేయస్ అయ్యర్ (8) విఫలమయ్యాడు. అయితే, రెండో టెస్టు ఆరంభానికి ముందే కెప్టెన్సీని వదులుకోవడంతో పాటు.. జట్టు నుంచి తప్పుకొన్నాడు. టెస్టుల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.అయితే, వెన్నునొప్పి కారణంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయలేకపోతున్నానని శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐకి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.ఆరునెలల పాటు దూరంఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆరునెలల పాటు శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరానీ కప్ మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేయలేదని స్పష్టం చేసింది.రజత్, తిలక్ అవుట్.. కెప్టెన్‌గా శ్రేయస్స్వదేశంలో రెండు అనధికారిక టెస్టుల తర్వాత భారత్- ‘ఎ’ జట్టు.. ఆస్ట్రేలియా- ‘ఎ’తో మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ (సెప్టెంబరు 30- అక్టోబరు 5) ఆడనుంది. కాన్పూర్ ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి వన్డేకు రజత్ పాటిదార్‌ను... రెండు, మూడో వన్డేలకు తిలక్ వర్మను తొలుత బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే, తాజాగా వారిద్దరిని తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక తొలి వన్డేకు దూరంగా ఉండనున్న.. ఆసియా కప్-2025 ముగిసిన తర్వాత తిలక్ వర్మ.. రెండు, మూడో వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ సిరీస్ ఆడతారు. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఆస్ట్రేలియా- ‘ఎ’తో తొలి అనధికారిక వన్డేకు భారత జట్టుశ్రేయన్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుశ్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, సిమర్జీత్ సింగ్.ఆస్ట్రేలియా- ‘ఎ’తో రెండు, మూడో అనధికారిక వన్డేలకు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్ (డబ్ల్యుకె), రియాన్ పరాగ్, ఆయుశ్ బదోని , సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
IND VS AUS: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‌లో తడబడినా..!
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో (India A vs Australia A) భారత-ఏ బౌలర్లు చెలరేగిపోయారు. అంతకుముందు బ్యాటింగ్‌లో తడబడినా, బౌలింగ్‌లో మాత్రం చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధికి 226 పరుగుల భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపించారు.రెండో రోజు చివర్లో బౌలింగ్‌కు దిగి కేవలం 7.5 ఓవర్లలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. 3 పరుగుల వద్దనే ఓపెనర్ల పని పట్టి, మరో 13 పరుగుల తర్వాత నాలుగో నంబర్ ఆటగాడిని ఔట్ చేశారు. ఫామ్‌లో ఉన్న సామ్ కొన్‌స్టాస్‌ను (3) గుర్నూర్ బ్రార్.. మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ కెల్లావేను (0) సిరాజ్ (Mohammed Siraj).. ఒలివర్ పీక్‌ను (1) మానవ్ సుతార్ ఔట్ చేశారు.ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆ జట్టు లీడ్ 242 పరుగులుగా ఉంది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (11) క్రీజ్‌లో ఉన్నాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఆసీస్ సాధించిన 420 పరుగుల భారీ స్కోర్‌కు బదులిచ్చే క్రమంలో 194 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్ (Sai Sudharsan) (75) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ఎన్ జగదీసన్ (38), ఆయుశ్ బదోని (21), ప్రసిద్ద్ కృష్ణ (16 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్(KL Rahul) (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో థార్న్టన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్‌ల్యాండ్, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్ బ్రార్ 3, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి కాగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం -
టీమిండియాకు ఊహించని షాక్.. స్టార్ బౌలర్ తలకు తీవ్ర గాయం
స్వదేశంలో త్వరలో వెస్టిండీస్‌తో (India vs West Indies) జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు (Team India) ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్ కోసం జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందు స్టార్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ (Prasidh krishna) తీవ్రంగా గాయపడ్డాడు.ఆస్ట్రేలియా-ఏతో (india A vs Australia A) రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్లో హెన్రీ థార్న్టన్ సంధించిన రాకాసి బౌన్సర్ ప్రసిద్ధ్ హెల్మెట్‌ను బలంగా తాకింది.వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించగా, ప్రసిద్ధ్ టెస్ట్‌ను క్లియర్ చేసి బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మూడు ఓవర్ల తర్వాత అస్వస్థతకు లోనై 42వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్‌గా ఫీల్డ్‌ను వీడాడు. ప్రసిద్ద్ మైదానాన్ని వీడే సమయానికి 25 బంతుల్లో 16 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కంకషన్ సబ్‌గా యశ్ ఠాకూర్ప్రసిద్ధ్ స్థానంలో యశ్ ఠాకూర్ కంకషన్ సబ్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక ప్రసిద్ధ్ ఈ మ్యాచ్‌లో పాల్గొనడు. ఈ మ్యాచ్‌లో ప్రస్దిద్ తొలుత బౌలింగ్‌లో 17 ఓవర్లు వేసి ఓ వికెట్ తీశాడు.వెస్టిండీస్ సిరీస్ దూరం..?ప్రసిద్ద్ గాయం తీవ్రతపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయడం అనుమానమేనని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రసిద్ద్ ఎంపిక దాదాపుగా ఖరారై ఉండింది. ఆఖరి నిమిషంలో గాయపడటంతో ప్రసిద్ద్ విండీస్ సిరీస్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయినట్లే. వర్క్ లోడ్ కారణంగా ఈ సిరీస్‌కు బుమ్రాను విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావించింది. ప్రసిద్ద్ గాయపడిన నేపథ్యంలో బుమ్రాను విండీస్ సిరీస్‌లో ఆడించే అవకాశం ఉంది. బుమ్రా, ఆకాశ్‌దీప్, సిరాజ్‌తో పాటు మరో పేసర్‌ను విండీస్ సిరీస్‌కు ఎంపిక చేయవచ్చు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 420 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 194 పరుగులకే ఆలౌటైంది. 226 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం -
IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు (IND A vs AUS A)లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కు మొదటి ఇన్నింగ్స్ 226 పరుగుల ఆధిక్యం లభించింది.లక్నోలోని ఏకనా స్టేడియంలో ఆసీస్‌తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్-‘ఎ’ జట్టు.. తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలిరోజు 350 ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (5/93) ఐదు వికెట్లతో విజృంభించడంతో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాక్ ఎడ్వర్డ్స్ (78 బంతుల్లో 88; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (162 బంతుల్లో 74; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఎడ్వర్డ్స్ ధనాధన్ షాట్లతో రెచ్చిపోగా... మెక్‌స్వీనీ సంయమనం పాటిస్తూ అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్ (91 బంతుల్లో 49, 7 ఫోర్లు), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (33 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా రాణించారు.420 పరుగులకు ఆలౌట్ఒలీవర్ పీక్ (29 6 ఫోర్లు), టాడ్ మార్ఫీ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన పరుగులు జోడించారు. ఈ క్రమంలో 350/9తో ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్.. 420 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్లుఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్-‘ఎ’ 194 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (11) విఫలం కాగా.. నారాయణ్ జగదీశన్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, దేవ్‌దత్ పడిక్కల్ (1), కెప్టెన్ ధ్రువ్ జురెల్ (1), నితీశ్ కుమార్ రెడ్డి (1) దారుణంగా ఫెయిల్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 140 బంతులు ఓపికగా ఆడి 75 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో ఆయుశ్ బదోని (21) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ప్రసిద్ కృష్ణ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.శ్రేయస్స్థానంలో సారథిగా జురెల్ ఆసీస్-‘ఎ’ బౌలర్లలో హెన్రీ థార్న్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టామ్ మర్ఫీ రెండు, క్యారీ రొసిచిల్లి, కూపర్ కన్నోలి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’జట్టు పలు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... అందులో భారత ‘ఎ’జట్టు సారథిగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. దీంతో అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ సారథ్య బాధ్యతలు అందుకోగా... జగదీశన్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్... కాస్త విశ్రాంతి తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టూర్లో గాయపడిన ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... సాధికారికంగా బౌలింగ్ చేశాడు. తొలి రోజు 8 ఓవర్లు వేసిన అతడు 16 పరుగులిచ్చి వికెట్ పడగొట్టలేకపోగా... బుధవారం నాటి ఆటలో బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఇక సిరాజ్ 73 పరుగులు ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీయగా... గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టాడు.భారత్-‘ఎ’ వర్సెస్ ఆసీస్-‘ఎ’ స్కోర్లు👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 420👉భారత్ తొలి ఇన్నింగ్స్: 194👉ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల ఆధిక్యంచదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ -
IND vs AUS: ఆసీస్ భారీ స్కోరు.. కేఎల్ రాహుల్ ఫెయిల్
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) విఫలమయ్యాడు. భారత్-‘ఎ’ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్.. ప్రాక్టీస్ కోసం భారత్-‘ఎ’ జట్టులో చేరిన విషయం తెలిసిందే. ఆసీస్ (IND A vs AUS A)తో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా వీరిద్దరు ఎంట్రీ ఇచ్చారు. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఆసీస్ భారీ స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 97.2 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (49), వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీన్ భారీ అర్ధ శతకం (74)తో రాణించాడు. మిగతా జాక్ ఎడ్డర్డ్స్ 88 పరుగులు, టాడ్ మర్ఫీ 76 పరుగులతో సత్తా చాటగా.. హెన్రీ థార్న్టన్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఐదేసిన మానవ్ సుతార్భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బకాగా బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 350/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో డెబ్బై పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌కు మొదలు పెట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రాహుల్ ఫెయిల్ఓపెనర్గా వచ్చిన సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఆసీస్ యువ పేసర్ విల్ సదర్లాండ్ బోల్తా కొట్టించాడు. అతడి బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న రాహుల్ ఒకే ఒక్క ఫోర్ బాది.. 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో భోజన విరామ సమయానికి భారత్ పది ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 382 పరుగులు వెనుకబడి ఉంది.ఇక లంచ్ ముగిసిన వెంటనే భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ థార్న్టన్ బౌలింగ్‌లో సదర్లాండ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 14 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి సాయి సుదర్శన్ 4, దేవ్‌దత్ పడిక్కల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 61-2.ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండో అనధికారిక టెస్టుకు భారత్-‘ఎ’ తుది జట్టు నారాయణ్ జగదీశన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ (కెప్టెన్- వికెట్ కీపర్), ఆయుష్ బదోని, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను...
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా వైదొలగడం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చాన్నాళ్లుగా టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న ఈ ముంబైకర్‌కు ‘ఎ’ జట్టు సారథిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సువర్ణావకాశం ఇచ్చింది.ఆస్ట్రేలియా- ‘ఎ’తో అనధికారిక టెస్టులుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC)లో భాగంగా టీమిండియా.. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్ (IND vs WI)తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, విండీస్‌తో సిరీస్‌కు ముందు భారత్- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ మధ్య రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేసిన బీసీసీఐ.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ టీమిండియా స్టార్లను కూడా ఎంపిక చేసింది. ఇక రెండో టెస్టులో భాగంగా టీమిండియా సీనియర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా భారత్-‘ఎ’ జట్టులో చేరారు.కెప్టెన్సీతో పాటు జట్టు నుంచీ తప్పుకొన్నాడుఅయితే, తొలి టెస్టులో విఫలమైన శ్రేయస్ అయ్యర్(8).. రెండో టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచీ వైదొలిగాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం..‘‘శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని సెలక్టర్లకు చెప్పాడు. రానున్న కొన్ని నెలల పాటు అతడు టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉండబోతున్నాడు.కారణం ఇదేవెన్నునొప్పి కారణంగా తన శరీరం నాలుగు కంటే ఎక్కువ రోజులు ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధంగా లేదని చెప్పాడు. అందుకే ఇప్పట్లో టెస్టు క్రికెట్‌ను పూర్తి స్థాయిలో ఆడలేనని స్పష్టం చేశాడు. కాబట్టి సెలక్టర్లు ఇందుకు తగినట్లుగానే అతడి విషయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.గతంలో బీసీసీఐ వేటుఫలితంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు కూడా శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు తెలుస్తోంది. కాగా గతేడాది కూడా శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరం కాగా... బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఫిట్‌గానే ఉన్నా అబద్దం చెప్పాడని.. దేశీ క్రికెట్ తప్పనసరిగా ఆడాలన్న నిబంధనను ఉల్లంఘించాడని పేర్కొంటూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకున్న శ్రేయస్ అయ్యర్ దేశీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. అనూహ్య రీతిలో పుంజుకునిముఖ్యంగా కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ పొట్టి ఫార్మాట్లో ఇరగదీశాడు.ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 (వన్డే)లోనూ టీమిండియా తరఫున సత్తా చాటి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఆసియా కప్ టీ20- 2025 టోర్నీకి మాత్రం సెలక్టర్లు అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. భవిష్యత్తు ప్రశ్నార్థకందీంతో బోర్డు తీరుపై విమర్శలు రాగా.. భారత్ -‘ఎ’ కెప్టెన్‌గా ఛాన్స్ ఇచ్చింది. కానీ శ్రేయస్ అయ్యర్ తనకు తానుగా తప్పుకొని మరోసారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. కాగా అయ్యర్ గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా చివరి టెస్టు ఆడాడు.చదవండి: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్ -
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇవాళ (సెప్టెంబర్ 23) నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత-ఏ కెప్టెన్సీ నుంచి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తప్పుకున్నాడు. ఆటగాడిగానూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత మేనేజ్మెంట్ వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను (Dhruv Jurel) కెప్టెన్‌గా నియమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జురెల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.రాణించిన మెక్‌స్వీనీ, జాక్ ఎడ్వర్డ్స్తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88) అర్ద సెంచరీలతో రాణించారు. స్టార్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్ (39) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి టాడ్ మర్ఫీ (29), హెన్రీ థార్న్టన్ (10) క్రీజ్‌లో ఉన్నారు.ఐదేసిన యువ స్పిన్నర్భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 28 ఓవర్లలో 93 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుతార్‌తో పాటు గుర్నూర్ బ్రార్ (13-0-71-2), ప్రసిద్ద్ కృష్ణ (13-3-63-1), మొహమ్మద్ సిరాజ్ (13-1-73-1) వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, ఆయుశ్ బదోనికి వికెట్లు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి భారత్-ఏ తరఫున బరిలోకి దిగారు.చదవండి: దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ కన్నుమూత -
IND vs AUS: ‘సెంచరీ’ వీరుడికి షాకిచ్చిన సిరాజ్.. ఒక్క పరుగు దూరంలో..
భారత్-‘ఎ’- ఆస్ట్రేలియా-‘ఎ’ జట్ల (IND A vs AUS A) మధ్య మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. లక్నోలోని భారత రత్ర శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టు నుంచి వైదొలగడంతో అతడి స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) సారథిగా బాధ్యతలు చేపట్టాడు.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా ఆసీస్-‘ఎ’తో మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఆదిలోనే షాక్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు.. పేసర్ ప్రసిద్ కృష్ణ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లావేను తొమ్మిది పరుగులకే పరిమితం చేశాడు. ప్రసిద్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కెల్లావే సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, మరో ఓపెనర్, తొలి టెస్టులో సెంచరీ బాదిన సామ్ కొన్‌స్టాస్ మాత్రం క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలకు చేరువైన వేళ.. ఈ జంటను విడదీయడానికి భారత బౌలర్లు ప్రయత్నించారు.కొన్‌స్టాస్‌ను అవుట్ చేసిన సిరాజ్ఈ నేపథ్యంలో భోజన విరామ సమయం తర్వాత సిరాజ్ ఈ ప్రయత్నంలో సఫలమయ్యాడు. అర్ధ శతకానికి ఒక పరుగు దూరంలో ఉన్నవేళ కొన్‌స్టాస్‌ను అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా కొన్‌స్టాస్ వెనుదిరిగాడు. మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఏడు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.తొలి టెస్టులో ఇరగదీసిన ఇరు జట్ల బ్యాటర్లుకాగా భారత్‌తో తొలి అనధికారిక టెస్టులో సామ్ కొన్‌స్టాస్ సెంచరీ (109) చేసిన విషయం తెలిసిందే. ఇక మరో ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లావే (88), ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ అజేయ శతకం (123)తో దుమ్ములేపాడు. దీంతో 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. నారాయణ్ జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. దేవ్‌దత్ పడిక్కల్ (150), ధ్రువ్ జురెల్ (140) భారీ శతకాలతో చెలరేగారు. ఈ క్రమంలో 141.1 ఓవర్ల వద్ద ఏడు వికెట్ల నష్టానికి 531 పరుగులు చేసి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే, ఆ తర్వాత చివరి రోజు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగించింది. అప్పటికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలలేదు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఆసీస్ కెప్టెన్ అర్ధ శతకంఇక రెండో అనధికారిక టెస్టులో తొలిరోజు 42 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (49) ఫర్వాలేదనిపించగా.. కాంప్‌బెల్ కెల్లావే (9) నిరాశపరిచాడు. కెప్టెన్ మెక్‌స్వీనీ అర్ధ శతకం (50), ఓలీవర్ పీక్ 25 పరుగులతో క్రీజులో నిలిచారు. చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. కారణం? -
శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేశాడు!
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భారత్-‘ఎ’ కెప్టెన్సీతో పాటు.. జట్టు నుంచి కూడా వైదొలిగాడు. కాగా భారత జట్టు స్వదేశంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు (IND A vs AUS A)తో రెండు అనధికారిక టెస్టు సిరీస్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ అయ్యర్‌ను నియమించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో అతడి సారథ్యంలో ఆసీస్‌తో తొలి అనధికారిక టెస్టును భారత్ డ్రా చేసుకుంది. కెప్టెన్సీకి, జట్టుకు గుడ్బైఅయితే, బ్యాటర్‌గా మాత్రం అయ్యర్ విఫలమయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య లక్నోలో మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. మ్యాచ్ ఆరంభానికి ముందు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అంతేకాదు.. జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయం గురించి విశ్వసనీయ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..సెలక్టర్లకు సమాచారం‘‘శ్రేయస్ విరామం తీసుకున్నాడు. అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా- ఎ జట్టుతో రెండో మ్యాచ్‌లో ఆడలేనని అయ్యర్ సెలక్టర్లకు సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే జట్టులో మిడిలార్డర్ బ్యాటర్‌గా అతడు పోటీలోనే ఉంటాడు’’ అని పేర్కొన్నాయి. కాగా వ్యక్తిగత కారణాల వల్లే శ్రేయస్ అనూహ్యంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న శ్రేయస్.. ఓవైపు వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎక్కడికి దారితీస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్ఇక శ్రేయస్ అయ్యర్ జట్టును వీడటంతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. తెలుగు కుర్రాడు, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో రెండో అనధికారిక టెస్టుకు భారత్-‘ఎ’ తుది జట్టు ఇదేనారాయణ్ జగదీశన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ (కెప్టెన్- వికెట్ కీపర్), ఆయుష్ బదోని, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.చదవండి: ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్ -
జురెల్, పడిక్కల్ అద్భుత శతకాలు.. డ్రాగా ముగిసిన భారత్-ఆసీస్ తొలి టెస్ట్
భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నాలుగో రోజైన ఇవాళ (సెప్టెంబర్ 19) నిర్దేశిత సమయం కంటే ముందుగానే మ్యాచ్‌ను ముగించారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 6 వికెట్ల నష్టానికి 532 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3, గుర్నూర్ బ్రార్ 2, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్ ఆసీస్‌కు ధీటుగా జవాబిచ్చింది. ఆధిక్యం సాధించే అవకాశం ఉన్నా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఒక్క పరుగు ముందుగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 531 పరుగులు చేసింది.ధృవ్ జురెల్ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (281 బంతుల్లో 150; 14 ఫోర్లు, సిక్స్) అద్బుత శతకాలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.ఒక్క పరుగు లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ 27, క్యాంప్‌బెల్ కెల్లావే 24 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఇదే వేదికగా సెప్టెంబర్ 23-26 మధ్య జరుగనుంది.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు.. 3 అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. వన్డేలు సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి. -
IND vs AUS: ఆసీస్‌కు ధీటుగా బదులిచ్చిన భారత్.. ఒకే ఒక్క పరుగుతో..
అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు భారత్-‘ఎ’ జట్టు ధీటుగా బదులిచ్చింది. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారీ శతకాలతో చెలరేగడంతో జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్ కంటే ఒకే ఒక్క పరుగు వెనుకబడి ఉన్నవేళ భారత జట్టు తమ స్కోరును డిక్లేర్ చేయడం విశేషం.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మంగళవారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన భారత్.. తొలుత బౌలింగ్ చేసింది. అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.ఆసీస్ @532ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (109), వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. మరో ఓపెనర్ కాంపెబెల్ కెల్లావే (88).. ఆల్‌రౌండర్లు కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) అద్భుత అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో ఆసీస్ 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 141.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 531 పరుగుల వద్ద ఉన్న వేళ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.జురెల్, పడిక్కల్ భారీ శతకాలుభారత టాపార్డర్‌లో అభిమన్యు ఈశ్వరన్ (44) ఆకట్టుకోగా.. నారాయణ్ జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (149)తో పాటు నాలుగో నంబర్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ (150) భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) పూర్తిగా విఫలం కాగా.. తనుశ్ కొటియాన్, హర్ష్ దూబే (నాటౌట్) చెరో 16 పరుగులు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో కారీ రాచిసిల్లీ మూడు వికెట్లు తీయగా.. కూపర్ కన్నోలి, లియామ్ స్కాట్, ఫెర్గూస్ ఒ నీల్, జేవియర్ బార్ట్లెట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం.. డ్రా ఖాయమేఇక శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆటలో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు 12 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ 15, కాంపబెల్ కెల్లావే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ కంటే ఆసీస్ 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక సెషన్ మాత్రమే మిగిలి ఉన్నందున ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయం. ఇరుజట్ల మధ్య ఏకనా స్టేడియంలోనే సెప్టెంబరు 23- 26 వరకు రెండో అనధికారిక టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్‌కు ధీటుగా..
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో టీమిండియా స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారీ శతకంతో మెరిశాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 198 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా తన కెరీర్లో ఏడో ఫస్ట్‌క్లాస్ సెంచరీని నమోదు చేశాడు.కాగా భారత్-‘ఎ’ జట్టు స్వదేశంలో ఆసీస్-‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో భాగంగా మంగళవారం తొలి టెస్టు మొదలుకాగా టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఆసీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్సామ్ కొన్‌స్టాస్ (109), జోష్ ఫిలిప్ (123 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కాంపెబెల్ కెల్లావే (88), కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆసీస్ 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.భారత బౌలర్లలో హర్ష్ దూబే (Harsh Dube) మూడు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. టాపార్డర్ హిట్.. ధీటుగా భారత్ సమాధానంఇక ఆసీస్ భారీ స్కోరు చేయగా.. అందుకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (44), నారాయణ్ జగదీశన్ (64) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అర్ధ శతకం (73)తో మెరిశాడు.అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ భారీ శతకం (140)తో ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టగా.. శుక్రవారం నాటి ఆట సందర్భంగా పడిక్కల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.పడిక్కల్ భారీ శతకంనాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పడిక్కల్.. మొత్తంగా 281 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం భోజన విరామ సమయానికి భారత జట్టు 138 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 520 పరుగులు సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ కారీ రాచిసిల్లీ.. శ్రేయస్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, తనూశ్ కొటియాన్ రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇతరులలో కూపర్ కన్నోలి, లియామ్ స్కాట్, ఫెర్గూస్ ఒ నీల్, జేవియర్ బార్ట్లెట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే భారత్ ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల అనధికారిక టెస్టులో ఇదే ఆఖరి రోజు. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయే అవకాశం ఉంది.ఒకే ఒక్క పరుగుఅప్డేట్: ఇక లంచ్ తర్వాత మళ్లీ మొదలైన ఆట.. వర్షం కారణంగా నిలిచిపోయింది. హర్ష్ దూబే 16, ప్రసిద్ కృష్ణ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 531/7 (141.1). ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే భారత్ ఒకే ఒక్క పరుగు వెనుకంజలో ఉంది. చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
IND VS AUS: శతక్కొట్టిన ధృవ్ జురెల్.. టీమిండియా భారీ స్కోర్
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మెరుపు శతకంతో చెలరేగాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన జురెల్.. 113 పరుగుల వద్ద (132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.మరో ఎండ్‌లో జురెల్‌కు జోడీగా ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. పడిక్కల్ 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్ (44) పర్వాలేదనిపించాడు. భారత-ఏ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ స్కోర్ 103 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 403 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సామ్ కొన్‌స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు.కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. -
IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్‌స్టాస్, ఫిలిప్.. ఆసీస్ భారీ స్కోరు
భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. సెంచరీతో కదంతొక్కిన కొన్స్టాస్టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్ కొన్‌స్టాస్ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్‌బెల్ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్ అవుట్ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (1), ఒలీవర్ పీక్ (2)ను వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్ కనొల్లీ, లియామ్ స్కాట్ (79 బంతుల్లో 47 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పట్టుదల కనబర్చారు.దూబే... ఒక్కడే ఈ జంట ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్ కృష్ణ (0/47), ఖలీల్ అహ్మద్ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.జోష్ ఫిలిప్ అజేయ సెంచరీఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్ స్కాట్‌తో పాటు జోష్ ఫిలిప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్ స్కాట్ (81) అదరగొట్టగా.. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్ జేవియర్ బార్ట్లెట్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 2, నారాయణ్ జగదీశన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో..ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు


