
స్వదేశంలో త్వరలో వెస్టిండీస్‌తో (India vs West Indies) జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు (Team India) ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్ కోసం జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందు స్టార్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ (Prasidh krishna) తీవ్రంగా గాయపడ్డాడు.
ఆస్ట్రేలియా-ఏతో (india A vs Australia A) రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో హెన్రీ థార్న్‌టన్ సంధించిన రాకాసి బౌన్సర్ ప్రసిద్ధ్ హెల్మెట్‌ను బలంగా తాకింది.
వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించగా, ప్రసిద్ధ్ టెస్ట్‌ను క్లియర్ చేసి బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మూడు ఓవర్ల తర్వాత అస్వస్థతకు లోనై 42వ ఓవర్‌లో రిటైర్డ్ హర్ట్‌గా ఫీల్డ్‌ను వీడాడు. ప్రసిద్ద్ మైదానాన్ని వీడే సమయానికి 25 బంతుల్లో 16 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.
కంకషన్ సబ్‌గా యశ్ ఠాకూర్
ప్రసిద్ధ్ స్థానంలో యశ్ ఠాకూర్ కంకషన్ సబ్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక ప్రసిద్ధ్ ఈ మ్యాచ్‌లో పాల్గొనడు. ఈ మ్యాచ్‌లో ప్రస్దిద్ తొలుత బౌలింగ్‌లో 17 ఓవర్లు వేసి ఓ వికెట్ తీశాడు.
వెస్టిండీస్ సిరీస్ దూరం..?
ప్రసిద్ద్ గాయం తీవ్రతపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయడం అనుమానమేనని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రసిద్ద్ ఎంపిక దాదాపుగా ఖరారై ఉండింది.
ఆఖరి నిమిషంలో గాయపడటంతో ప్రసిద్ద్ విండీస్ సిరీస్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయినట్లే. వర్క్ లోడ్ కారణంగా ఈ సిరీస్‌కు బుమ్రాను విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్ భావించింది. ప్రసిద్ద్ గాయపడిన నేపథ్యంలో బుమ్రాను విండీస్ సిరీస్‌లో ఆడించే అవకాశం ఉంది. బుమ్రా, ఆకాశ్‌దీప్, సిరాజ్‌తో పాటు మరో పేసర్‌ను విండీస్ సిరీస్‌కు ఎంపిక చేయవచ్చు.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 420 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 194 పరుగులకే ఆలౌటైంది. 226 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం