
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మెరుపు శతకంతో చెలరేగాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన జురెల్.. 113 పరుగుల వద్ద (132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
మరో ఎండ్‌లో జురెల్‌కు జోడీగా ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. పడిక్కల్ 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్ (44) పర్వాలేదనిపించాడు. భారత-ఏ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ స్కోర్ 103 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 403 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సామ్ కొన్‌స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు.
కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది.