source: BCCI X
టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో (టెస్టు సిరీస్‌లో) వరుసగా రెండు సెంచరీలు సాధించిన అతడు.. ప్రస్తుతం జరుగుతన్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన అర్ద సెంచరీతో సత్తా చాటాడు.
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగిన పడిక్కల్, తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన పరుగులు సాధించాడు. కేవలం 65 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. మొత్తం 104 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.
పడక్కిల్ అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. సౌత్ జోన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు కేవలం 176 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (1), నారాయణ్ జగదీశన్ (32), పడిక్కల్ (62), షేక్ రషీద్ (27), స్మరణ్ రవిచంద్రన్ (23) ఔట్ కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ (18), శ్రేయస్ గోపాల్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోర్‌కు సౌత్ జోన్ ఇంకా 532 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు.
అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.
చదవండి: వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ!


