source: X
పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (SAF) గేమ్స్‌కు భారత్ తమ బృందాన్ని పంపేందుకు సమ్మతి తెలిపినట్లు ఆ దేశ మీడియా చెప్పుకుంటుంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో జరిగే క్రీడా పోటీలకు భారత బృందం నిజంగానే వెళ్తుందా అని భారతీయులు చర్చించుకుంటున్నారు.
SAF గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఖాలిద్ మెహమూద్ వెల్లడించినట్లు 'ది న్యూస్ పాకిస్తాన్' అనే వార్తా సంస్థ పేర్కొంది.
ది న్యూస్ పాకిస్తాన్ కథనం ప్రకారం.. దక్షిణాసియా ఒలింపిక్ అసోసియేషన్‌కు సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం ఉందని మెహమూద్ తెలిపారు. భారత్ నుంచి ఎంత మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారు.. ఏయే క్రీడాంశాల్లో బరిలోకి దిగుతారు.. అనే వివరాలు వచ్చే ఏడాది జనవరిలో వెల్లడించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
SAF గేమ్స్‌లో క్రికెట్, హాకీ సహా 28 క్రీడాంశాలు ఉంటాయి. భారత హాకీ జట్టు చివరిగా 2006లో పాక్‌లో పర్యటించగా.. భారత క్రికెట్ జట్టు చివరిగా 2008లో పాక్‌లో పర్యటించింది.
చదవండి: టీమిండియా ప్లేయర్‌పై పాక్ అభిమానుల అభ్యంతరకర వ్యాఖ్యలు


