దేశానికి ప‌తకం తీసుకొస్తే లైంగిక వేధింపులతో స్వాగ‌తం! | Powerlifter Keyaa Banerji-Won Silver-India-Reveals Online Harassment | Sakshi
Sakshi News home page

దేశానికి ప‌తకం తీసుకొస్తే లైంగిక వేధింపులతో స్వాగ‌తం!

Sep 7 2026 6:46 PM | Updated on Sep 7 2026 6:54 PM

Powerlifter Keyaa Banerji-Won Silver-India-Reveals Online Harassment

Photo Credit: Twitter

దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన '2026 ఐపీఎఫ్ వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ల'లో జూనియర్ మహిళల 47 కేజీల విభాగంలో భార‌త్‌కు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ కీయా కునాల్ బెన‌ర్జీ రజత పతకాన్ని సాధించింది. పోటీ సమయానికి కేవలం 45.70 కేజీల బరువున్న కీయా, తన శరీర బరువుకు మూడు రెట్ల కంటే ఎక్కువ బరువైన 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తి సంచలనం సృష్టించింది. 

పవర్‌లిఫ్టింగ్ రంగంలో తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి కీర్తి తెచ్చిన ఆమెకు కొంతమంది ఆన్‌లైన్ వేధింపుల‌తో స్వాగతం పలకడం క‌ల‌క‌లం రేపింది. ఆమె ఘ‌న‌త‌ను పొగ‌డాల్సింది పోయి ఆన్‌లైన్ వేదిక‌గా ఆమె పేరిట న‌కిలీ ఖాతాలు వెలిశాయి. అంత‌టితో ఆగ‌కుండా కొంత‌మంది ఆమె ముఖాన్ని, శ‌రీరాన్ని ఏఐ సాయంతో అస‌భ్య‌క‌ర‌రీతిలో మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. జాతి వివక్ష వ్యాఖ్య‌ల‌తో ఆమెను మాన‌సికంగా ఒత్తిడికి లోన‌య్యేలా చేశారు.

ఇదే విష‌య‌మై కీయా కునాల్ మాట్లాడుతూ.. "పవర్‌లిఫ్టింగ్ అనేది నన్ను నేను సవాలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సోషల్ మీడియా ప్రచారం కోసం కాదు. ఆట‌లో పోటీ ప‌డి గెల‌వ‌డ‌మే త‌ప్ప ఇలాంటి వేధింపుల‌తో వ‌చ్చే పేరు, ఫాలోవ‌ర్లు నాకొద్దు. నా అనుమతి లేకుండా ఏఐ చిత్రాలను సృష్టించడం దారుణం. డెడ్‌లిఫ్ట్ ఇష్టపడే ఒక సాధారణ అమ్మాయిగా బతికే ప్రశాంతమైన జీవితం మాత్రమే నాకు కావాలి. ప్లీజ్ న‌న్ను స్వేచ్ఛ‌గా బ‌తక‌నివ్వండి" అని కీయా కునాల్ బెన‌ర్జీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఇక కీయా కునాల్ పాల్గొన్న‌ టోర్న‌మెంట్ విష‌యానికొస్తే..ఫ్రాన్స్‌కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ 165 కేజీలతో స్వర్ణం సాధించగా, ఐర్లాండ్‌కు చెందిన బ్లాత్‌నైడ్ ఓడ్వైర్‌ కూడా 140 కేజీలే ఎత్తిన‌ప్ప‌టికీ, నియమాల ప్రకారం ఓ'డ్వైర్‌ను అధిగమించి కీయా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 

140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో పాటు స్కౌట్‌లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 50 కేజీలు.. మొత్తం కలిపి 280 కేజీల బరువును ఎత్తి ఓవ‌రాల్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. ప‌వ‌ర్‌లిఫ్టింగ్‌లో భార‌త్‌కు ప‌త‌కం తీసుకొచ్చి  దేశ ఖ్యాతిని ఇనుమ‌డింప‌చేసిన కీయా కునాల్‌కు సంతోషంతో స్వాగ‌తం ప‌ల‌కాల్సింది పోయి న‌ర‌క కూపంలోకి నెట్టేశారు.

Read: సీపీఎల్‌లో న‌బీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement