సాక్షి, చెన్నై: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసెంబ్లీలో దుమారం కొనసాగుతుండగా, మరోవైపు టీవీకే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 5న రాత్రి పార్టీకి చెందిన కణ్ణన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గామారాయి. పాత కక్షలతోఒక ముఠా అతడిని కిరాతకంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కార్ రెంటల్ వ్యాపారం చేసే కణ్ణన్, సెప్టెంబర్ 5న తన స్నేహితులతో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఒక ముఠా ఆయనపై దాడి చేసింది. కత్తిపోట్లకు గురైన కణ్ణన్ అక్కడికక్కడే మృతి చెందాడు. శాస్త్రి నగర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి భరణి, రాకేష్, నరేష్, మణికంఠన్, హరిహరన్ అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Chennai - TVK functionary S. Kannan was chased and hacked to death by a gang in the Adyar–Besant Nagar area on Saturday night. Police have arrested five men. Kannan was standing near Ellaiamman Koil Street when attackers on two-wheelers surrounded him. He tried to flee, but the… pic.twitter.com/O45DiOOz2b
— NextMinute News (@nextminutenews7) September 7, 2026
ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం
ప్రతీకార హత్య
కన్నన్‌పై క్రిమినల్ కేసులు, హిస్టరీషీటర్‌గా రికార్డుల్లో ఉన్నట్లు పోలీసుల తెలిపారు. గతంలో 2009లో భరణి బాబాయి శివను, 2014లో భరణి తండ్రి వేలును కణ్ణన్ బృందం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ పాత కక్షలను మనసులో ఉంచుకునే భరణి, అతడి అనుచరులు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిని అడ్డుకోవడంలో విఫలమైనందుకు తమిళనాడు డీజీపీ ఆదేశాల మేరకు అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్‌తో పాటు శాస్త్రి నగర్ ఇన్‌స్పెక్టర్ రోహిణిలను వేకెన్సీ రిజర్వ్‌లోకి బదిలీ చేశారు.
நாளை மாண்புமிகு முதலமைச்சர் காவல்துறை மானியக் கோரிக்கை விவாதம் மீது பதிலுரை அளிப்பதற்கு முன்பாக அவரது கட்சிப் பிரமுகர் ஒருவரே தலைநகரில் கொலைக்கு ஆளாகியுள்ளார்.
அதுவும், தனது உயிருக்குப் பாதுகாப்பு வேண்டி ஆளும் த.வெ.க.வில் இணைந்த சரித்திரப் பதிவேடு குற்றவாளி சாலையில் ஓட ஓட…— Udhay (@Udhaystalin) September 6, 2026
మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షణ కోసం అధికార పార్టీలో చేరిన వ్యక్తే వీధిలో దారుణహత్యకు గురయ్యాడని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతోందని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!


